వారెవ్వా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ..! రూ.10వేల కోట్లు దాటిన నికరలాభం వడ్డీ ఆదాయంలోనూ 12% జంప్..!

2022-01-15 15:27:21 By Anveshi

img

ప్రవేట్ బ్యాంక్ దిగ్గజం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ Q3లో అద్బుతమైన లాభం ఆర్జించింది.రూ.10342కోట్లు నికర లాభంతో పాటుగా, వడ్డీ ఆదాయం రూ.18444కోట్లుగా నమోదు కావడంతో అడ్వాన్సులలో 16.4శాతం వృద్ధి నమోదు చేసి ఋణాల మంజూరులో డిపాజిట్ల వేటలో తనకి తిరుగులేదనిపించింది

 

గత ఏడాది క్యు3లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ రూ.8758.29కోట్ల లాభం ఆర్జించింది.నికర వడ్డీ ఆదాయం రూ.16317.61కోట్లు గడించింది. అంటే రెండు విభాగాల్లో  లాభంలో 24శాతం, వడ్డీ ఆదాయంలో 18శాతానికిపైగానే వృద్ది నమోదు చేసినట్లైంది

 

డిపాజిట్ల విషయానికి వస్తే, బ్యాంక్ ఇయరాన్ ఇయర్ బేసిస్‌లో 13.8శాతం క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్‌లో2.8శాతం  వృద్ధితో రూ.14.46లక్షల కోట్లుగా, కాసా డిపాజిట్లు రూ.6.81లక్షల కోట్లుగా ప్రకటించింది 

 


HDFC BANK Q3