పోర్ట్ స్టాక్స్‌లో వేల్యూ బయ్..! గుజరాత్ పిపావవ్..ఆ ఒక్కటి కుదిరిందంటే పిచ్చ లాభమంటోన్న అనలిస్ట్

2021-10-22 13:03:48 By Anveshi

img

గత ఏడాది కాలంలో అదానీ పోర్ట్స్  కంటైనర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా స్టాక్స్ మంచి గ్యాలప్ ప్రదర్శించాయ్. ఈ దశలో ఇన్వెస్టర్లు సెక్టార్ రొటేషన్ కోసం చూస్తున్న తరుణంలో ఈ పోర్ట్, లాజిస్టిక్స్‌ రంగంవైపు దృష్టి సారించగా, వాటిలో మంచి స్టాక్ కోసం అన్వేషణ ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలోనే  గుజరాత్ పిపావవ్ పోర్ట్స్ లిమిటెడ్ స్టాక్ బీటెన్ డౌన్ అయిన అంశం ప్రస్తావించుకోవాలి. 
ప్రపంచంలోనే అతి కొద్ది పోర్టులకు మాత్రమే డెట్ ఫ్రీ స్పెషాలిటీ ఉండగా, గుజరాత్ పిపావవ్ కూడా  వాటిలో ఒకటి.  

 

ఈ స్టాక్ ప్లస్ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, గుజరాత్ పిపావవ్ పోర్ట్స్‌కి డ్రా బ్యాక్ గా ఉన్న అంశం. ఈ పోర్టు లీజు 2028తో ముగియనుంది. ఇప్పటికే ఈ సంస్థ యాజమాన్యం దాన్ని 20248 వరకూ రెన్యువల్ చేసేందుకు ధరఖాస్తు చేసింది. ఇది కనుక కుదిరిందంటే అద్భుతమైన రాబడి ఈ సంస్థ ఆర్జిస్తుందని వెంచురా సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ వినీత్  బొలింజ్కర్ అంచనా

 

ఇప్పటికే తీవ్రమైన డిస్ట్రెషన్‌ వేల్యేషన్‌లో ఉన్న ఈ స్టాక్, కొనాలంటే ప్రస్తుత ధరలో మంచి ఛాన్స్ అని ఈ అనలిస్ట్ ఒపీనియన్ కాగా సంస్థ సమర్ధవంతంగా నడిచేందుకు యాజమాన్యం చేయాల్సిందంతా చేసిందని, ఇక ఏ మాత్రం లీజు గడువు రెన్యువల్ అయినా స్టాక్ ధర బాగా పెరుగుతుందని చెప్పారు. స్టాక్ ధర పెరిగినా, పెరగకపోయినా ఆదాయం మాత్రం అద్భుతంగా వస్తుందంటూ ఊరిస్తున్నారు. 

 

DFC కారిడార్‌లో రైల్వే ఫ్రైట్ రవాణాలో ఉన్న రాబడిని అందిపుచ్చుకుంటోన్న ఈ సంస్థకి మరో ప్లస్ పాయింట్, నావసేవలో ఇంకొకరు కనీసం రెండు మూడేళ్ల వరకూ ఎవరూ పోటీ రారు. ఈ లోపున మంచి ఆకర్షణీయమైన ఛాయిస్‌గా ఈ స్టాక్‌ని ఎంపిక చేయవచ్చనేది ఈ అనలిస్ట్ అంచనా

 

గుజరాత్ పిపావవ్ పోర్ట్ దేశంలోని ఫస్ట్ ప్రవేట్ పోర్ట్, దీన్ని  ఏపిఎం టెర్మినల్స్ గ్రూప్ ప్రమోట్ చేసింది. ఈ సంస్థ ప్రపంచంలోనే అతి పెద్ద కంటైనర్ టెర్మినల్ నిర్వహిస్తోన్న ఘనత దక్కించుకుంది. వెస్ట్ కోస్టల్ ఏరియాలోని ఈ పోర్టు ద్వారా  పదమూడున్నరలక్షల ట్వెంటీ ఫుట్ ఈక్విలెంట్ల హ్యాండ్లింగ్ కెపాసిటీ కలిగి ఉంది. 50లక్షల డ్రై కార్గో, 20లక్షల లిక్విడ్ కార్గో రవాణా చేయగల సామర్ధ్యం ఉంది

 

ప్రస్తుతం ఈ సంస్థ షేర్లు రూ.116 ధర వద్ద ట్రేడ్ అయ్యాయ్


GUJARAT PIPAVAV PORT BUY VINIT VENTURA

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending