ఓ రెండున్నరేళ్ల క్రితం స్టాక్ మార్కెట్లలో ఈ రెండు స్టాక్స్ ర్యాలీ ఓ పెద్ద సంచలనం. ఎక్కడ ఆగుతుందో తెలీదన్నట్లుగా తెగ పెరిగాయి వాటి ధరలు. ఐతే ఆ తర్వాత గ్లోబల్ క్యూస్తో పాటు కొంత ప్రాఫిట్ బుకింగ్, మరికొంత కన్సాలిడేషన్‌తో ఆ రెండు స్టాక్స్ కాస్త నెమ్మదించాయ్. ఐతే ఇప్పుడు కరోనా తర్వాత తిరిగి డిమాండ్ పెరగడంతో అన్ని సెక్టార్లతో పాటే ఈ షేర్లు కూడా తిరిగి ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నాయ్. ఇంతకీ ఆ రెండు స్టాక్స్ ఏవంటే, హెచ్ఈజీ, గ్రాఫైట్ ఇండియా
స్టీల్ ఉత్పత్తిలో పికప్ పెరగడంతో ఉక్కు తయారీలో కీలకమైన ఎలక్ట్రోడ్స్కి డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఇది ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకున్న పరిణామం.మరి ఆ ఎలక్ట్రోడ్స్ తయారీలోనే నిమగ్నమైన హెచ్ఈజీ రెండు రోజుల్లో 32శాతం పెరగగా, గ్రాఫైట్ ఇండియా 15శాతం పెరిగింది. దీంతో మార్కెట్లలో చాలామంది ఇన్వెస్టర్లు తిరిగి ఈ కౌంటర్లపైకి ఫోకస్ షిప్ట్ చేస్తున్నారు
ఇవాళ్టి ( ఏప్రిల్7) ట్రేడింగ్‌లో హెచ్ఈజీ 11శాతం పెరిగి సరికొత్త 52 వారాల గరిష్టమైన రూ.2033ని తాకింది. అలానే గ్రాఫైట్ ఇండియా కూడా 6 శాతం పెరిగి రూ.620కి చేరింది. ఇది కూడా ఈ స్టాక్‌కి సరికొత్త 52వారాల గరిష్టమే
ఇక గత 3 నెలల లెక్క చూస్తే, హెచ్ఈజీ 104శాతం, గ్రాఫైట్ ఇండియా 91శాతం పెరిగాయి.
గడచిన ఆక్టోబర్-డిసెంబర్ మధ్యకాలంలో స్టీల్ ప్రొడక్షన్‌కి ఓవరాల్ రికవరీ కన్పించగా గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్కి ఓ మాదిరి పికప్ మాత్రమే చోటు చేసుకుంది. ఐతే తర్వాతి కాలంలో స్టీల్ ఇండస్ట్రీ మరింత వృద్ధి నమోదు చేయడంతో గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ కంపెనీలకు గత ఇన్వెంటరీలన్నీ వినియోగం కావడంతో పాటు కొత్త ఉత్పత్తులు కూడా పూర్తిగా వినియోగించే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ రెండు కంపెనీల ఆదాయం, లాభదాయకత బాగా ఉంటాయనే అంచనాలు ఏర్పడ్డాయ్. రాబోయే క్వార్టర్లో ఎలక్ట్రోడ్ ధరలు కూడా పెరుగుతాయని ధీమా వ్యక్తం చేస్తోంది హెచ్ఈజీ యాజమాన్యం. స్టీల్ ఉత్పత్తుల వ్యాపారంలో ఉన్న కంపెనీలతో పాటు, స్టీల్ సంబంధింత ఉత్పత్తులు వినియోగించే రంగాలకు భారీగా డిమాండ్ ఏర్పడిందని, ఇదే తమ భవిష్యత్ లాభాలకు బాట అని గ్రాఫైట్ ఇండియా కంపెనీ యాజమాన్యం గత క్యు3 ఫలితాల ప్రకటన సందర్భంలోనే అభిప్రాయపడింది. అలానే, రాబోయే రోజుల్లోనూ ఎలక్ట్రోడ్ ధరల కన్సాలిడేషన్‌తో పాటు మౌలిక వసతుల రంగంలో ప్రభుత్వ,ప్రవేట్ రంగ పెట్టుబడులు తమ ఉత్పత్తులకు బారీ వ్యాపార అవకాశాలు కల్పిస్తాయని అంచనా వేస్తోంది.
ప్రస్తుతం హెచ్ఈజీ 334.20 పైసల లాభంతో 18.31శాతం లాభపడి రూ.2158 వద్ద ట్రేడ్ అయింది
గ్రాఫైట్ ఇండియా రూ.79.80పైసల లాభంతో 12.56శాతం పెరిగి రూ.667.15 వద్ద ట్రేడ్ అయింది