బ్యాంకులో డబ్బు మాయమైందా.. ఒక్క ఫోన్ కాల్ తో మనీ బ్యాక్ వస్తుంది

2021-06-17 22:29:38 By Y Kalyani

img

బ్యాంకులో డబ్బు మాయమైందా.. ఒక్క ఫోన్ కాల్ తో మనీ బ్యాక్ వస్తుంది 

దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్స్ పెరుగుతున్నాయి. క్షణాల్లో డబ్బు బ్యాంకుల నుంచి మాయమవుతోంది. అంతా డిజిటల్ అయిన తర్వాత మన బ్యాంకుల్లో డబ్బుకు కూడా భద్రత లేకుండా పోయింది. రూరల్ ఇండియాలో ఈ మోసాలు మరీ దారుణంగా ఉంటున్నాయి. ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కేంద్ర హోంశాఖ ఆద్వర్యంలో నేషనల్ హెల్ప్ లైన్ ప్రకటించింది. 155260 నెంబరు ఉంటుంది. ఎవరైనా సైబర్ మోసాలకు గురి అయితే వెంటనే ఈ నెంబర్ కు ఫోన్ చేయవచ్చు. టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇది 7 రాష్ట్రాల్లో అందుబాటులో ఉంది. చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్తాన్, ఉత్తరాఖండ్, యూపీ రాష్ట్రాల్లో వినియోగిస్తున్నారు.

ఎలా పనిచేస్తుందంటే...
బాధితులు ఈ నెంబర్ కు ఫోన్ చేయాలి. మీ వివరాలు పోలీసులు రాసుకుంటారు. మీ ప్రాధమిక సమాచారం తీసుకుంటారు. అనంతరం మీ ఫిర్యాదు టికెట్ ను సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్స్  రిపోర్టింగ్ అండ్ మేనేజ్ మెంట్ సిస్టమ్ కు రిపోర్ట్ చేస్తారు. అక్కడి నుంచి బ్యాంకు, లేదా వాలెట్, లేదా ఇతర ఆర్ధిక సంస్థలకు వెళుతుంది. ఎక్కడ అయితే డబ్బు మాయం అయిందో అక్కడ వివరాలు సేకరిస్తారు. బాధితులకు రీసిప్ట్ పత్రం కూడా ఇస్తారు. ఒకవేళ బ్యాంకు వద్ద డబ్బు ఇంకా పెండింగ్ ఉంటే వెంటనే ఆపేస్తారు. ఈ ఫిర్యాదును వెళ్లాల్సిన బ్యాంకు ఖాతాకు కూడా పంపుతారు. ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందో మీకు ఇచ్చిన ఈ రీసిప్ట్ ఆధారంగా ఆన్ లైన్ లో http:/cybercrime.gov.in లో అప్ డేట్ తెలుసుకోవచ్చు. అవతల బ్యాంకులో డబ్బు ఎవరి ఖాతాలో వెళ్లిందో వెంటనే గుర్తించి.. అకౌంట్ ఫ్రీజ్ చేస్తారు. దీనిపై విచారణ జరిపి అక్రమాలు జరిగి ఉంటే రికవరీ చేస్తారు.
ఈ సదుపాయం ఏప్రిల్ 2021 నుంచి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ట్రయల్ వెర్షన్ నడుస్తోంది. ఇప్పటివరకూ ఈ రెండు నెలల్లో ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వచ్చిన ఫిర్యాదులతో రూ.1.85 లక్షలు కాపాడారు.మోసగాళ్ల భారీన పడకుండా అడ్డుకున్నారు.  


banks cheating cash frauds tollfree number