ఆన్‌లైన్ గేమింగ్, కేసినో ఇండస్ట్రీకి షాక్ రెడీ ! 28% పన్ను అమలుకు సిద్ధం ! ఈ 2 స్టాక్స్‌కి దబిడి దిబిడేనా..?

2022-05-18 18:15:40 By Anveshi

img

కేంద్రప్రభుత్వం ఆన్ లైన్ గేమ్స్, కేసినో, రేస్ కోర్సులపై జిఎస్టీని పెంచే ప్రతిపాదన ఉన్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. వచ్చే నెలలో  జరిగే సమావేశంలో ఈ దిశగా ఏదైనా నిర్ణయం వెలువడవచ్చు.


గత నెలలో మేఘాలయలో జరిగిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో ఏకగ్రీవంగా ఈ రేటు పెంపుపై నిర్ణయం తీసుకున్నారు

 

ఇప్పటిదాకా ఈ ఆన్ లైన్‌ గేమ్స్ కానీ, కేసినోలు, రేసు కోర్సులపై 18శాతం జిఎస్టీ అమలు అవుతోంది.మరిప్పుడు ఏకంగా పదిశాతం పెంచడమంటే అదో పెద్ద షాకే..! కస్టమర్ బిల్ ఏకంగా పదిశాతానికిపైగా పెరుగుతుంది

 

అందుకే ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, జిఎస్టీ కౌన్సిల్‌కి తమ విజ్ఞప్తిని విన్నవించుకుంది.ఇలా 18శాతం పన్నుతోనే చాలా ఇబ్బందులు పడుతున్నామని, 28శాతం పన్ను కనుక విధిస్తే..అది మొత్తం ఈ రంగానికే పిడుగుపాటు అవుతుందని , తాము రోడ్డుపాలవుతామని కూడా ఈ అసోసియేషన్ గగ్గోలు పెట్టింది

 

స్టాక్ మార్కెట్లలో లిస్టెడ్ స్పేస్‌లో ఉన్న డెల్టా కార్ప్ పరిస్థితి  తాత్కాలికంగా దాఋణంగా తయారవవచ్చు.
నజారా టెక్నాలజీస్ వంటి షేర్లకి ఎలక్ట్రిక్ షాక్ తగలొచ్చు ఎందుకంటే నజారా టెక్నాలజీస్ ఇప్పటికే చాలా మటుకు నష్టాల్లో ఉంది. ఇప్పుడు జిఎస్టీ కనుక 28శాతానికి పెరిగితే ఇమ్మీడియేట్‌గా ఈ రెండు స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడం ఖాయం