ఐఆర్‌సిటిసికి ఫ్లైబిగ్ రూపంలో మరో ఛాన్స్

2021-10-23 17:21:03 By Anveshi

img

ఈ మధ్యనే లాంచ్ అయిన్ ఫ్లైబిగ్ ఎయిర్ లైన్స్, తన టిక్కెట్ల కోసం ఐఆర్‌‌సిటిసితో జట్టు కట్టింది
ఈశాన్య రాష్ట్రాల్లోని టూరిజం డెవలప్‌మెంట్‌కి ఇది సహకరిస్తుందని, IRCTCకి ఉన్న పాపులారిటీ తమ 
సీట్ల ఆక్యుపెన్సీకి ఉపయోగపడుతుందని ఫ్లైబిగ్ నమ్ముతోంది. 

 

Air ప్లాట్‌ఫామ్‌లో ఐఆర్‌సిటిసి ద్వారా ఈశాన్య రాష్ట్రాలకు విమానాల ద్వారా వెళ్లదలిచిన వారు టిక్కెట్లు
బుక్ చేసుకోవచ్చు. దీంతో తమకి యూజర్ ఛార్జీలు భారీగా మిగులుతాయని ఐఆర్‌సిటిసి అంచనా వేస్తోంది

 

దేఖో అప్నా దేశ్ స్లోగన్‌తో ఈ భాగస్వామ్యం కుదరగా, ఈశాన్య రాష్ట్రంలోని పూలవనాలు, సొగసైన సంస్కృతి సందర్శకులను ఆకట్టుకుంటుందని ఫ్లైబిగ్ సంస్థ చెప్తోంది. ఆజాదీకీ అమృత మహోత్సవ్ పేరిట ప్రస్తుతం కార్యక్రమాలు సాగుతున్నవేళ ఈ ఒప్పందం ఉభయతారకంగా ఐఆర్‌సిటిసి భావిస్తోంది

 

తేజు, పసిఘాట్, రూప్సీ, అగర్తల, దిబ్రూగర్, కోల్‌కతా నుంచి గువాహటికి ప్రస్తుతం ఫ్లైబిగ్ విమానాలు ఎగురుతున్నాయ్.గత వారం రోజులుగా స్టాక్ మార్కెట్లలో భారీ హెచ్చుతగ్గులతో కలకలం రేపిన ఐఆర్‌సిటిసికి ఇది ఓ ట్రిగ్గర్ అయ్యే అవకాశాలు ఉన్నాయ్. అది పైకా కిందకా అన్నది సోమవారం తేలుతుంది


IRCTC FLYBIG

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending