దలాల్‌స్ట్రీట్‌లో దాండియా డ్యాన్స్..! దంచి కొడుతోన్న మార్కెట్ల ర్యాలీకి రీజన్లివే..!

2021-10-14 12:15:34 By Anveshi

img

వరసగా ఆరో రోజు కూడా మార్కెట్ల లాభాల బాటలో సాగుతున్నాయ్.  ఇన్నాళ్లూ ప్రపంచదేశాల్లో సెంట్రల్ బ్యాంకులు ఇచ్చిన తక్కువ వడ్డీ రేట్లకు అడ్డుకట్ట పడినా, సరే ఆ ప్రభావం మన ఈక్విటిల్లో ఎంత మాత్రం కన్పించడం లేదు. అన్ని రంగాల షేర్లలో ర్యాలీ కన్పిస్తోంది

 

సెన్సెక్స్ 450 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 150 పాయింట్లు లాభపడింది. 61,180 పాయింట్లకు సెన్సెక్స్ ఎగయగా, నిఫ్టీ 18300 పాయింట్ల మార్క్ దాటేసి పరుగులు పెడుతూనే ఉంది. ఇంతటి ర్యాలీకి కారణాలేవంటే,

 

1.ఐటీ సెక్టార్ ఔట్‌ఫెర్ఫామ్ చేయడానికి ముందుకు రావడం విప్రో, ఇన్ఫోసిస్, మైండ్ ట్రీ ఆర్ధిక ఫలితాలు అద్భుతంగా ఉండటంతో ఇక ఈ రంగంలోని స్టాక్స్ మంచి పెర్ఫామెన్స్ చేస్తాయనే అందరూ నమ్ముతున్నారు. ఉద్యోగులు ఇతర సంస్థలకు మారడం ఎక్కువగా ఉన్నా..సరే ఈకంపెనీలు రాబోయే రోజుల్లో మంచి ఆదాయం గడిస్తాయని చెప్తున్నారు. 

 

2. షార్ప్ కరెక్షన్‌కి కారణాలేవీ లేవు..ట్రిగ్గర్లూ లేవు. రిటైల్ ఇన్వెస్టర్లే ఇంకా ముందుకు వచ్చి పెట్టబుడులు పెడుతున్నారు. దీంతో పాత ఇన్వెస్టర్ల వేల్యేషన్‌ వర్రీలను ఈ కొత్త ఇన్వెస్టర్లు పట్టించుకోవడం లేదని జియోజిత్ సీఐఎస్ వీకే విజయకుమార్ చెప్తున్నారు

 

3. ప్రధాన ఇఁడెక్స్‌లతో సంబంధం లేకుండా ఇతర సెక్టార్లు, స్మాల్ అండ్ మిడ్ క్యాప్, పిఎస్ఈ,  స్టాక్స్ మంచి అప్‌ట్రెండ్ ప్రదర్శించడం

 

4. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు: టోక్యో, సిడ్నీ, సియోల్, వెలింగ్ టన్,తైపీ,మనీలా,జకార్తా అన్నీ పాజిటివ్‌గా ఉన్నాయ్. 

 

ఈ కారణాలతో మన మార్కెట్లు ఇవాళ మంచి గ్యాలప్‌మీదున్నట్లు చెప్తున్నారు


NIFTY 18300 SENSEX 61200

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending