సోషల్ మీడియాలో సూపర్ మంత్రి.. కేబినెట్ నుంచి అవుట్

2021-05-18 21:41:35 By Y Kalyani

img

సోషల్ మీడియాలో సూపర్ మంత్రి.. కేబినెట్ నుంచి అవుట్

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో రెండు భాగా ట్రోల్ అవుతున్నాయి. ఒకటి ప్రధానమంత్రి నరేంద్రమోదీని విమర్శించేవి ఒకటి.. రెండోది కేరళలో అధ్బుతంగా పనిచేసి ప్రజల మన్ననలు అందుకున్న ఆరోగ్యమంత్రి కేకే శైలజకు ప్రసంశలు. అవును గతంలో నిఫా వైరస్ వచ్చినప్పుడు..ఇప్పుడు కొవిడ్ సమయంలో ఆమె మంత్రిగా సమర్ధవంతంగా పనిచేశారు. ఆమెను సెలబ్రిటీల నుంచి సామాన్యుల దాకా కొనియాడుతున్నారు. చిన్న టీచర్ ఉద్యోగం నుంచి.. మంత్రి స్థాయికి వచ్చిన ఆమె సింపుల్ గా ఉంటారు. అంతేకాదు.. దేశానికి ఆరోగ్యమంత్రిని చేస్తే అందరికీ ఉచితవైద్యం అందిస్తా అని ఘనంగా ప్రకటించిన ఆమె తన పనితీరుతో ప్రాంతాలకతీతంగా మన్ననలు పొందారు. అయితే అనూహ్యంగా ఆమెకు కొత్త కేబినెట్ లో చోటు దక్కలేదు. 
అదేంటీ మంచి పనిచేసినా పదవి ఇవ్వరా అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కామెంట్లు. రెండోసారి విజయన్ సీఎం కావొచ్చు కానీ.. మంత్రికి మాత్రం ఛాన్స్ ఇవ్వరా.. జలస్ తో చేస్తున్న పని అంటూ విమర్శలు వచ్చాయి. కమ్యూనిస్టులు ఎవరినీ ఎదగనీయరని కూడా అంటున్నారు. అయితే ఇవన్నీ భావొద్వేగంతో చేసే కామెంట్లు కానీ.. తనకు ఎలాంటి అసంత్రుప్తి లేదంటున్నారు శైలజ. ఐదేళ్లు తనకు అధ్బుత అవకాశం ఇచ్చారు. శక్తిమేరకు పనిచేశాను. అందరూ సహకరించారు. వారి సహకారంతో పేరు వచ్చింది. ఇది చాలు అంటున్నారు. కొత్తవారికి అవకాశం ఇవ్వడానికి నాకు పదవి ఇవ్వకపోయినా ఫర్వాలేదు అంటూ ఆమె తనదైన శైలిలో ప్రకటించారు. 


kerala left party shailaja news

Expert's View


నేను వేసుకున్న కోటు రంగు , రానున్న రోజుల్లో మార్కెట్ల రంగు ఇదేనా ?

Trending