జొమేటో షేర్లు ఇస్తామంటున్నా..వాళ్లెందుకు వద్దన్నారు ? లైట్ తీస్కోవడానికి రీజనేంటి?

2021-07-21 13:56:22 By Anveshi

img

మార్కెట్లలో ప్రస్తుతం ఐపిఓల క్రేజ్
ఈ ఇయర్ బిగ్గెస్ట్ ఐపిఓ జొమేటో
జొమేటో షేర్ల కోసం పోటెత్తిన ఇన్వెస్టర్లు
ఎంప్లాయీల ఇంట్రస్ట్ మాత్రం అంతంత మాత్రమే..!
లైట్ తీస్కోవడానికి రీజనేంటి?

 

స్టాక్ మార్కెట్లలో ప్రస్తుతం నడుస్తోన్న క్రేజీ థీమ్ ఐపిఓ. ఏ రంగషేర్లు ఎలాగైనా పోనీయండి..అలానే లిస్టయ్యే కొత్త కంపెనీ ఏ  రంగానికైనా చెందనీయండి, ఐపిఓల కోసం మాత్రం జనం ఎగబడుతున్నారంటే అతి చేసి చెప్పడం కాదు. ఇలాంటి తరుణంలో  మార్కెట్లలోకి లిస్ట్ కాబోతోంది జొమేటో ఐపిఓ. రూ.9375కోట్ల నిధుల సేకరణ కోసం వచ్చిన జొమేటో, క్వాలిఫైడ్  ఇన్సిట్యూషనల్ బయ్యర్ల పోర్షన్ 51.79రెట్లు, నాన్ ఇన్సిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటా 7.45రెట్లు సబ్‌స్క్రైబ్ కాగా, రిటైల్ పోర్షన్ కూడా బంపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది

 

కానీ ఉద్యోగుల కోసమని అట్టిపెట్టిన 65లక్షల షేర్లు మాత్రం వారిని ఆకట్టుకోలేకపోయినట్లు తెలుస్తోంది. మొత్తం 40.3లక్షల  షేర్ల కోసమే ఉద్యోగులు ధరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఇలా ఓ ఐపిఓకి వస్తున్న సంస్థ, తమ ఉద్యోగులకు కేటాయించిన షేర్లు పూర్తిగా సబ్‌స్క్ర్రైబ్ కాకపోవడం ఇది రెండోసారి సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌కి ఆ సంస్థ ఉద్యోగుల నుంచి 34శాతం మాత్రమే అప్లై చేసుకోగా, మ్యాక్రోటెక్ డెవలపర్స్ ( లోధా) ఇష్యూకి 17శాతం మాత్రమే బిడ్లు దాఖలు అయ్యాయ్. గత రెండేళ్లలో ఈ రెండు కంపెనీలదే ఉద్యోగుల మనసు చూరగొనలేకపోయిన ఐపిఓగా చరిత్రకెక్కగా, ఇప్పుడు వాటి సరసన  జొమేటో కూడా చేరిపోయింది.

 

జొమేటో విషయంలో ఎందుకిలా జరిగిందన్న విషయంపై కొంతమంది ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయం ఏమిటంటే, ఇప్పటికే చాలామంది  ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ సంస్థలో కలిగి ఉన్నారని, అందుకే ఈ  ఇష్యూపై పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదని కేపిటల్ వయా  గ్లోబల్ రీసెర్చ్ సంస్థ హెడ్ గౌరవ్ గార్గ్ చెప్తున్నారు. ఐతే 60శాతం సబ్‌స్కిప్రషన్ పొందడం కూడా గమనించాలని..ఇదో ఇష్యూ  కాదంటారాయన.  అదీ కాకుండా తమ కేపిటల్‌ను కొన్నాళ్లు పాటు లాక్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి కూడా కొందరు ఈ షేర్ల అలాట్‌మెంట్‌కి దూరంగా ఉండుంటారని తెలుస్తోంది

 

మొత్తం మీద మార్కెట్లలో ప్రస్తుతానికైతే..జొమేటోపై అంచనాలు భారీగా ఉన్నాయ్. అందుకే ఈ సంస్థకి సంబంధించిన ఏ  సమాచారమైనా అందరినీ ఆకర్షిస్తుందనే చెప్పాలి. జులై 27న లిస్ట్ అవుతుందని చెప్తోన్న ఈ ఐపిఓ ఎలా పెర్పామ్  చేయబోతోందో  చూడాలి

 


zomato esop employee stock option portion 60% done over worry concern july27 ipo listing qip