ఆల్‌టైమ్ రికార్డ్ లెవల్‌కి బిట్‌కాయిన్ : తమాషా ట్వీట్ చేసిన మస్క్..! బహుశా పశ్చాత్తాపడుతున్నాడేమో..! 

2021-10-22 16:30:04 By Anveshi

img

ట్రెండ్ ఫాలో అవడం కంటే సెట్ చేయడమే బెటర్ అనుకున్నట్లుగా వ్యవహరించే ఎలాన్ మస్క్ రెండు రోజుల క్రితం ఓ ట్వీట్ చేశాడు. అది బిట్‌కాయిన్ వేల్యూ 69వేల డాలర్లు దాటడంపై. బెడ్‌రూమ్‌లో ఓ జంట రిలాక్స్ అవుతుండగా ఎదురుగా స్క్రీన్‌పైన బిట్ కాయిన్ వేల్యూ ప్రదర్శింపబడి ఉంటుందందులో..!

 

అసలు ఈ సంవత్సరం మొదట్లో ఈ మహానుభావుడి పుణ్యమా అని బిట్ కాయిన్ వేల్యూ ఏప్రిల్-మే నెలల మధ్యలో 65వేల డాలర్లకు చేరింది. అప్పటికి అదే హయ్యెస్ట్ రేటు. మరి మనం కూడా బోలెడు కథనాలు అప్పట్లో రాయడం మీరు చదవడం గుర్తుండే ఉంటుంది. 150కోట్ల డాలర్లకి సమానమైన బిట్ కాయిన్లను టెస్లా కంపెనీ కొనుగోలు చేసిందంటూ ఎలాన్ మస్క్ అప్పుడు ట్వీట్ చేశాడు. అప్పట్నుంచి ఇక మెయిన్ స్ట్రీమ్‌లోనూ బిట్ కాయిన్ గురించిన మాటలు విన్పించడం ప్రారంభమైంది. ఆ తర్వాతి రోజుల్లో సాల్వెడార్ వంటి దేశం దీన్ని అఫిషియల్ కరెన్సీగా కూడా అంగీకరించింది. తర్వాతి పరిణామాల్లో భాగంగా బిట్ కాయిన్ వేల్యూ దాదాపు 15శాతానికిపైగా పతనం అయింది అలా డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ వేల్యూ ఉన్న బిట్ కాయిన్ సింగిల్ బెడ్రూమ్ ధరకి( హైదరాబాద్) పడిపోయింది

 

ఎలాన్ మస్క్ తాను కొనడం తర్వాత టెస్లా కార్లకు బిట్ కాయిన్లను తీసుకుంటామని ప్రకటించడం జరిగిన రెండు మూడు నెలలకే తూచ్ అన్నాడు.క్రిప్టో కరెన్సీలో కింగ్ లాంటి ఈ అసెట్ క్లాస్‌కి సూపర్ ఫ్యూచర్ ఉందంటూనే, పర్యావరణానికి హాని కలిగించకూడదని, వాతావరణ సమతుల్యతని ఖరీదుగా పెట్టి, ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయనంటూ బిల్డప్ ఇచ్చాడు. అక్కడికేదో ఆ రెండు నెలల్లోనే బిట్ కాయిన్ ఎలా ఉత్పత్తి( డిజిటల్‌గా) అవుతుంది, దాని మైనింగ్ ఏంటీ తెలియకుండానే అందులోకి దిగాడా అంటూ కామెంట్లు కూడా నెటిజన్లు పెట్టారు

 

ఇదిగో  రెండు రోజుల క్రితం తిరిగి బుసలు కొడుతూ పైకి లేచిన బిట్ కాయిన్‌పై ఎలాన్ మస్క్, తన ట్వీట్ చేయడం ఆసక్తి గొలిపింది. ఇదొక్కటే కాదు..ఎథీరియం కూడా 4200డాలర్లకు పెరిగింది.

 

బ్లాక్ చెయిన్ టెక్నాలజీని వాడుకుని మైనింగ్ అయ్యే ఈ బిట్ కాయిన్ రేటులో విపరీతమైన అప్ అండ్ డౌన్స్ ఉంటాయ్. ఆల్ టైమ్ హైకి చేరిన తర్వాత తిరిగి 6శాతం పతనమవడమే ఇందుకు నిదర్శనం. కడపటి సమాచారం ప్రకారం ప్రస్తుతం బిట్ కాయిన్ వేల్యూ 63,141 డాలర్లకు సమానం..మన రూపాయల్లో 47లక్షల27వేలకి పైమాటే..! 


etherium bitcoin musk tweet

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending