దడ్‌దడలాడించిన డిఎల్ఎఫ్! Q4లో టర్న్ అరౌండ్ ప్రాఫిట్!రూ.480.94కోట్ల లాభం

2021-06-11 19:46:12 By Anveshi

img


రియల్ఎస్టేట్ మేజర్ కంపెనీ డిఎల్ఎఫ్ FY2021 Q4లో రూ.480.94కోట్ల నికరలాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే సమయంలో  క్యు4లో రూ.1857.76కోట్ల నష్టం చవిచూసిన కంపెనీకి ఇది పెద్ద బూస్ట్‌గానే చూడాలి. అలానే వ్యాపార కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం కన్సాలిడేటెడ్ పద్దతిలో 1.1శాతం వృద్ధితో రూ.1712.57కోట్లు గడించింది. అలానే మొత్తంఆర్థిక సంవత్సరానికి కూడా రూ.1093.61 కోట్ల లాభం గడించింది డిఎల్ఎఫ్. 2020 ఏడాదిలో మాత్రం రూ.583.19కోట్ల నష్టం చవిచూసిన కంపెనీ మొత్తం మీద ఏడాది గడిచేసరికి పూర్తి టర్న్ అరౌండ్ ఫలితం ప్రకటించడం విశేషం

 

2021 మొత్తానికి కన్సాలిడేటెడ్ రెవెన్యూ మాత్రం 11 శాతం తగ్గి రూ.5414.06కోట్లకి పరిమితమైంది. 

 

ఆర్థిక ఫలితాల ప్రకటన అనంతరం , బోర్డు అశోక్ కుమార్ త్యాగి,దేవేందర్ సింగ్‌లను పూర్తి స్థాయి డైరక్టర్లుగా నియమించడంతో పాటు హోల్‌టైమ్ డైరక్టర్లుగా కూడా ఎలివేట్ చేసింది.వీళ్లద్దిరూ ఇవాళ్టి వరకూ తాత్కాలిక డైరక్టర్లుగా కొనసాగారు.  అంతేకాకుండా, డిఎల్ఎఫ్ ఛైర్మన్ కూతుళ్లైన సావిత్రిదేవి సింగ్, అనుష్కసింగ్‌లను కంపెనీ అదనపు డైరక్టర్లుగా నామినేట్ 
చేసింది

డిఎల్ఎప్ కంపెనీ షేర్లు శుక్రవారం 1.15శాతం నష్టంతో రూ.310.05 వద్ద ముగిశాయి

 

 


DLF Q4 PROFIT SHARES RALLY SAVITRI DEVI SINGH ANUSKA SINGH RAJIV SINGH DIRECTORS VP CHAIRMAN REALESTATE PROFIT

Expert's View


నేను వేసుకున్న కోటు రంగు , రానున్న రోజుల్లో మార్కెట్ల రంగు ఇదేనా ?

Trending