డాషింగ్ డీల్ కుదుర్చుకున్న డిక్సన్ టెక్నాలజీస్..! 'ఏస్‌'ర్‌ డీల్‌తో 4% జంప్, ఇంట్రాడేలో రూ.220 లాభం

2021-11-25 10:58:05 By Anveshi

img

వైట్ గూడ్స్ తయారీ కంపెనీ..బ్రాండ్ బిహైండ్ ది బ్రాండ్స్-డిక్సన్ టెక్నాలజీస్‌ ఇవాళ ఇంట్రాడేలో కేక పుట్టించేసింది. 4శాతానికిపైగా ర్యాలీ చేసి షేరు ధర రూ.5300కి ఎగసింది. ఈ మధ్యకాలంలో ఈ స్టాక్ అస్సలు లైమ్‌లైట్‌లో లేదు. జూన్-జులై మధ్యకాలంలో తెగ వెలిగిపోయిన ఈ కంపెనీ షేర్లు..స్టాక్ స్లిట్ అయిన తర్వాత తిరిగి అదే జోరు ప్రదర్శించింది ఇవాళే..


ఇంత  ఊపు రావడానికి కారణం, తైవాన్ కంపెనీ ఏసర్‌, తన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ కోసం డిక్సన్‌తో చేతులు కలపడమే, ల్యాప్ ట్యాప్, ఎలక్ట్రానిక్స్ తయారీ కోసం ఏసర్ డిక్సన్‌తో జాయింట్ వెంచర్ డీల్ కుదుర్చుకుంది. ఏడాదికి 5లక్షల ఏసర్ ల్యాప్‌ట్యాప్‌లు డిక్సన్ తయారు చేసి ఇవ్వనుంది

 

ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్‌ని ఈ డీల్‌ అందిపుచ్చుకోబోతోంది. వేల్యూ సెగ్మెంట్‌లో ఏసర్ తన ముద్ర వేసేందుకు డిక్సన్‌తో డీల్ కుదుర్చుకోగా, ఈ ల్యాప్‌ట్యాప్స్‌ తయారీ ఫ్యాక్టరీ నోయిడాలో తన పనులు ప్రారంభించబోతోంది. ఏసర్ ఇండియా చీఫ్ సుధీర్ గోయెల్, డిక్సన్ ఎక్సిక్యూటివ్ ఛైర్మన్ సునీల్ వాచానిలు ఈ కార్యక్రమానికి హాజరు కాగా, ఎలక్ట్రానిక్స్ ^& ఐటీ మినిస్ట్రీ జాయింట్ సెక్రటరీ సౌరభ్ గౌర్ ముఖ్యఅతిధిగా హాజరై, ఈ యూనిట్‌ని ప్రారంభించారు. 

 

కథనం ప్రచురించే సమయానికి డిక్సన్ టెక్నాలజీస్ షేర్లు రూ.5147.95 వద్ద ట్రేడ్ అయ్యాయ్


DIXON ACER

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending