డిసెంబర్ రేంజ్ 17200-17800..! రోల్ఓవర్స్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్ల ట్రెండ్ చెప్తోంది ఇదే; పెర్ఫామెన్స్‌కి స్కోప్ ఉన్న ఈ 3 రంగాలు

2021-11-26 08:11:06 By Anveshi

img

అక్టోబర్, నవంబర్ తర్వాత డిసెంబర్ నెల కూడా గరిష్టాలకు కిందనే ట్రేడవుతుందని ఓ సిగ్నల్ వచ్చింది. డిసెంబర్ నెల కాంట్రాక్టుల ఎంపిక కానీ, కాల్, పుట్ ఆప్షన్ల ట్రెండ్ కానీ చూస్తే, బేరిష్‌ సిగ్నల్స్‌నే ఎక్కువ ఇస్తున్నట్లు తెలుస్తోంది 18615 పాయింట్ల నుంచి ఇప్పటికే నిఫ్టీ 1200 పాయింట్లు కోల్పోయింది. దీంతో నిఫ్టీ రేంజ్ 17200-18000 కానీ, ఇంకా కిందకు వస్తే 16900-17000కి కూడా పతనం అయ్యే అవకాశాలు ఉన్నాయ్. దీనికేం పెద్ద కొమ్ములు తిరిగిన అనలిస్టుల అవసరం లేదు

 

డిసెంబర్ నెల అంతా కూడా అమెరికన్లకి క్రిస్‌మస్ హాలిడే సీజన్, థ్యాంక్స్ గివింగ్ డే అంటూ ఎక్కడిక్కడ ఖర్చు పెట్టడానికి ఎంజాయ్ చేయడానికి ఈ నెలను వాడుతుంటారు. దానికి తోడు అమెరికా రిజర్వ్ బ్యాంక్ లిక్విడిటీ ట్యాప్‌ని టైట్ చేయబోతోందని చెప్తున్నారు. ఇలాంటప్పుడు మనకి అంతర్జాతీయంగా కొంత ప్రతికూల సంకేతాలు తాత్కాలికంగా కన్పిస్తున్నాయ్. 

 

ఓ వైపు ఆయిల్ రిజర్వ్‌లను బైటికి తెస్తామని చెప్పినా కూడా ఒపెక్ వినడం లేదు. దీంతో ఆ పరమైన ఒడిదుడుకులు ఎటూ ఉండనే ఉన్నాయ్ దేశంలోని ద్రవ్యోల్బణం, ఎప్పుడు బ్లాస్ట్ అవుతాయో తెలీని కరోనా కేసులు దేశీయంగా మనకి పొంచి ఉన్న ప్రమాదాలు.

 

ఇక రోలోవర్స్‌కి వస్తే, 82.57శాతంగా ఉంది. మూడు నెలల యావరేజ్ అయిన 82.31శాతానికి ఇది దాదాపు సమానం. ఈ రోల్ఓవర్స్ ఎక్కువగా షార్ట్ పొజిషన్లకే ప్రాధాన్యత ఇచ్చాయ్. అందుకే 17800 పాయింట్లకి పైన నిఫీ పెరగనంత కాలం ఎవరూ లాంగ్ పొజిషన్లను నిఫ్టీలో సూచించడం లేదు.

 

నవంబర్ సిరీస్‌లో నిఫ్టీ 1.8శాతం, సెన్సెక్స్ 2శాతం క్షీణించాయ్


ఈ నెలలో రియల్ఎస్టేట్,టెలికాం,టెక్స్‌టైల్ కంపెనీలు మంచి పెర్ఫామెన్స్ ఇవ్వచ్చనేది యాక్సిస్ సెక్యూరిటీస్‌కి చెందిన రాజేష్ పాలవీయ చెప్పారు 

 

అలాగని..ఏకమొత్తంగా ఇక నిఫ్టీ ఏ మాత్రం పైకి లేవదని, మన్ను తిన్న పాములాగా అక్కడక్కడే తిరుగుతుందనీ చెప్పలేం. ఏ ఒక్క మేజర్ ఈవెంట్ చోటు చేసుకున్నా చాలు.. మూడు నాలుగు సెషన్లలోనే గరిష్టాలకు చేరువ అవుతాయి కూడా. టెక్నికల్‌గా మాత్రం నిఫ్టీ రేంజ్ 17200-17800 అని యాక్సిస్ సెక్యూరిటీస్ చెప్తోంది


rollovers signals trend december

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending