డే ట్రేడింగ్ కోసం ఓ ఆటో..ఓ పెయింటింగ్ స్టాక్..! రూ.50-400 రిటన్‌కి ఛాన్స్..! స్టాప్‌లాస్ మస్ట్ గురూ..!

2021-07-22 08:50:17 By Anveshi

img

నిఫ్టీ 50 రోజుల యావరేజ్ కంటే పైనే సస్టెయిన్ కావడంలో బుల్స్ సక్సెస్ కాగలిగారు. దీంతో 15578 పాయింట్ల మార్క్ అనేది  కీ సపోర్ట్ లెవల్ కాబోతోందని యెస్ సెక్యూరిటీస్, టెక్నికల్ అనలిస్ట్ ఆదిత్య అగర్వాలా చెప్తున్నారు. అలానే షార్ట్ కవరింగ్ ర్యాలీ  వస్తే ఇండెక్స్ తిరిగి 15800-15840 పాయింట్ల వరకూ పెరగవచ్చనేది మరో ఒపీనియన్

 

ఇక డౌన్‌సైడ్ చూస్తే, 15700 దగ్గర ప్రాఫిట్ బుకింగ్ చోటు చేసుకుంటే, 15578-15500 వరకూ నిఫ్డీ జారవచ్చు.ఆర్ఎస్ఐ  పరంగా చూస్తే, నార్త్‌సైడ్ మూమెంటే కన్పిస్తుంది కాబట్టి..ఆ స్థితి రాకపోవచ్చనేది ఆదిత్య అగర్వాలా అంచనా. పనిలో పనిగా రెండు స్టాక్స్‌ని కూడా డే ట్రేడింగ్ కోసం రికమండ్ చేశారాయన

 

కొనండి: బెర్జర్ పెయింట్స్@రూ. 865
టార్గెట్ రూ.915
స్టాప్‌లాస్ రూ.830

నేరో కన్సాలిడేషన్ రేంజ్ నుంచి బ్రేకవుట్ లభించిన బెర్జర్ పెయింట్స్ కౌంటర్‌లో మంచి వాల్యూమ్స్ నమోదు అవుతున్నాయ్.  ఆర్ఎస్ఐ కూడా 60 పాయింట్ల లెవల్ వద్ద నమోదు కావడం కంపెనీ షేరు మరింత మొమెంటమ్ చూపిస్తుందనడానికి సంకేతం

 


కొనండి : మారుతి@రూ.7232
టార్గెట్ రూ. 7600
స్టాప్‌లాస్ రూ.7050


ఫిబోనాకి రిట్రేస్‌మెంట్ లెవల్ 61.8శాతం వద్ద సపోర్ట్ తీసుకున్న మారుతి కంపెనీ షేరు 50 రోజుల మూవింగ్ యావరేజ్‌పైన  ట్రేడవుతోంది. తర్వాత కూడా హయ్యర్ హైస్, హయ్యర్ లో ప్రైస్ ధర నమోదు చేస్తోన్న మారుతి షేరును స్టాప్‌లాస్  చూసుకుంటూ ట్రేడ్ చేయాలని సూచించారు ఆదిత్య అగర్వాలా

 

( పై స్టాక్ రికమండేషన్స్ రెండూ యెస్ సెక్యూరిటీస్ టెక్నికల్ అనలిస్ట్ ఆదిత్య అగర్వాలావి..ప్రాఫిట్ యువర్ సైట్‌వి కాదు గమనించగలరు)

 


berger paints auto maruti 50DMA RSI 60 ADITYA AGARWALA YES SECURITIES