ఆంధ్రప్రదేశ్‌లో దైకిన్ ఏసీ మాన్యుఫేక్చరింగ్ యూనిట్ : రూ.1000కోట్లతో ప్లాంట్!

2021-09-25 11:47:03 By Anveshi

img

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్‌ ఏపీలో పెట్టుబడులకు కాస్త ఊతమిచ్చినట్లే కన్పిస్తోంది.ఎయిర్ కండిషన్డ్ యూనిట్లు తయారీ పరిశ్రమలు నెలకొల్పితే వాటికి ప్రోత్సాహకాలు ఇస్తామంటూ కేంద్రం గత నెలలో ప్రకటించింది. అందుకు తగినట్లుగా కనీసం డజను కంపెనీలు తమ విస్తరణ వ్యూహాలను ప్రకటించగా అందులో భాగంగా దైకిన్ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లో రూ.1000కోట్లతో ఏసీ తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పింది


ఇందుకోసం భూకేటాయింపు కూడా జరిగినట్లు తెలుస్తోంది. వైట్ గూడ్స్ సెక్టార్‌కి ఈ పిఎల్ఐ స్కీమ్ కింద మొట్టమొదటగా  ఏర్పాటవుతున్న తొలి ఫ్యాక్టరీగా దైకిన్‌కి గుర్తింపు లభించనుంది. ఇందుకోసమే శుక్రవారం నెల్లూరు శ్రీసిటీలో 75 ఎకరాల కొనుగోలు ఒప్పందం కుదిరినట్లుగా తెలుస్తోంది. మొదటిదశలో వెయ్యి కోట్ల మేర పెట్టుబడి పెడుతున్నట్లుగా ప్రభుత్వవర్గాల సమాచారం కాగా, 2023 నుంచి ప్లాంట్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయ్. ఏడాదికి 15లక్షల ఏసీ యూనిట్లు తయారు చేయడంతోపాటు 3వేలమందికి ఉపాధి దక్కుతుందని సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు

 

జపాన్‌కి చెందిన దైకిన్, ఇండియానే తమ మాన్యూఫేక్చరింగ్ హబ్‌గా చేసుకుని ఇక్కడ తయారైన ఉత్పత్తులను, వెస్ట్ ఏషియా,శ్రీలంక, సౌత్ అమెరికా, ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తామని కంపెనీ ప్రకటించింది


daikin ac manufacturing unit sricity land purchase

Expert's View


ఇన్వెస్టర్లకు ఎనలిస్టుల "దసరా మాములు" స్టాక్ రెకమెండేషన్స్

Trending