టాప్ 31 స్టాక్స్‌కి కమోడిటీస్‌ ముప్పు! ముడిసరుకుతో మూడుతుందట!

2021-02-23 10:59:06 By Anveshi

img

నిఫ్టీ 50లోని 31 సంస్థలకు కమోడిటీస్ సంబంధిత రిస్క్ ఉందంటూ బ్యాంక్ ఆఫ్ అమెరికా రీసెర్చ్ సంస్థ హెచ్చరించడం
స్టాక్ ఇన్వెస్టర్లు కాస్త గట్టిగా ఆలోచించాల్సిన విషయం.  ఎందుకంటే నిఫ్టీ 50లో 46 శాతం మార్కెట్ కేపిటలైజేషన్ ఈ కంపెనీలదే. మరి అలాంటప్పుడు ఈ స్టాక్స్‌కి ఏదైనా జరిగితే, ఖచ్చితంగా అది నిఫ్టీకి యమా డేంజర్ అని చెప్పాలి. 

ప్రధాన కంపెనీలకు  స్టీల్, సిమెంట్, క్రూడ్, కోల్, కాపర్, అల్యూమినియం, ఐరన్ ఓర్,పామాయిల్, కాస్టిక్ సోడా కమోడిటీ రిలేటెడ్ ఉత్పత్తులతో సంబంధం ఉంది. మరి వీటి ధర ఎంత పెరిగితే అదే స్థాయి ఎఫెక్ట్ వీటిపై పడుతుంది. ముడి పదార్ధాల విక్రయాలు36శాతం,  స్టేపుల్స్ 31శాతం, 29శాతం ఎనర్జీ, 28శాతం ఇండస్ట్రియల్స్, హెల్త్ కేర్ సెక్టార్‌లో 22శాతం ధరలు పెరిగాయి. ఐతే ఇది ఇంత వరకూ పూర్తిస్థాయిలో ప్రధాన కంపెనీలకు షాక్ ఇవ్వలేదు. ఐటి, ఫైనాన్షియల్ రంగానికైతే వాటి సెగ అస్సలు లేదు. 

స్టీల్,సిమెంట్,క్రూడ్,బొగ్గు, కాపర్ తదితర ముఖ్యమైన ఉత్పత్తులు, వాటి ముడి ఉత్పత్తులు ధరలు 75శాతం పెరిగాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా చెప్పింది, దీంతో పాటే, ఈ కమోడిటీ రిస్క్‌ని ఈ కంపెనీలు తమ గ్రాస్ మార్జిన్లలో చేర్చుకోకపోవడంతో రాబోయే రోజుల్లో అంటే క్యు4పై తీవ్రప్రభావం చూపుతాయని అంచనా వేసింది. లాక్‌డౌన్ టైమ్‌లో కానీ తర్వాత కానీ తమ దగ్గరున్న నిల్వలతో ఈ భారం పడకుండా తప్పించుకున్నాయి కానీ,క్యు4 ఫలితాల్లో ఇది కన్పిస్తుందని చెప్తోంది బ్యాంక్ ఆప్ అమెరికా అందుకే రాబోయే రోజుల్లో నిఫ్టీ కన్సాలిడేట్ అవుతుందని, సెక్టార్ షిప్ట్‌తో ఇన్వెస్టర్లకు లాభాలు దక్కవచ్చని బ్యాంక్ ఆప్ అమెరికా చెప్తుంది

కాపర్ రేటు చూస్తే టన్నుకి 9వేల డాలర్ల ధరని తాకింది. ఇది గత పదేళ్లలో ఇదే అత్యధికం. లండన్ మెటల్ ఎక్స్‌ఛేంజ్‌లో మూడు నెలల రాగి కాంట్రాక్ట్స్ 9187 డాలర్లకు కూడా పెరిగింది. దీనికి డాలర్ వీక్ కావడం కూడా ఓ కారణమైనా..రాబోయే రోజుల్లో కాపర్ ధర మరింత పెరగనుంది. క్రూడ్ పెరిగితే, కాపర్ కూడా అదే బాటన పడుతుందని కమోడిటీస్ ఎక్స్‌పర్ట్స్ ఇప్పటికే చెప్తున్నారు. అంతేకాదు కొంతకాలంలోనే ఆరు రెట్టు పెరిగిన కాపర్ కౌంటర్‌లో  బుల్ ర్యాలీ నడుస్తోంది. 

క్రూడ్ కొంపముంచుతుందా..?
మరోవైపు క్రూడాయిల్ ధర పెరగడం భారత్‌లో రెండు రకాల ధోరణులకు దారి తీస్తుందని బ్యాంక్ ఆఫ్ అమెరికాలోని  ఇండియన్ ఈక్విటీస్ స్ట్ర్రాటజిస్ట్ అంచనా వేసారు.  ప్రతి పది డాలర్ల పెరుగుదల భారత ఆర్థిక వ్యవస్థలోని ఫిస్కల్ డెఫిసిట్ కి అదనంగా 
12-13 బిలియన్ డాలర్లు, కరంట్ అక్కౌంట్ డెఫిసిట్‌కి 10-11 బిలియన్ డాలర్ల మేర అదనంగా చేరుతుంది. బ్రెంట్ క్రూడాయిల్ గత మార్చి-ఏప్రిల్ సీజన్‌లో 19 డాలర్లకి కూడా పడిపోయింది. ఐతే ఇప్పుడది ఏకంగా 63 డాలర్లకి చేరింది. బ్యారెల్‌కి
63డాలర్లనేది పెద్ద ధర కాదు..కానీ అంత పతనం నుంచి 230శాతం పెరగడమే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం.

ఇంకా లోతుగా వెళ్తే అసలు మీరు మా దగ్గర క్రూడ్ కొనండి మేమే మీకు ఎదురు డబ్బులిస్తామనే స్థాయికి కూడా అప్పట్లో
క్రూడ్ పతనం సాగింది. అలాంటిది ఇప్పుడు ఈ స్థాయికి చేరడం మార్కెట్లోని డిమాండ్‌కి కారణం. మన దేశం విషయానికి వస్తే అంత తక్కువలో కొన్నా కూడా..ఎక్కడా ఆ లాభం వినియోగదారుడికి ఏరోజూ పంచలేదు. రాష్ట్రాలు పన్నులు విధిస్తున్నాయనే
సాకులు చెప్పడమే తప్ప..బ్రెంట్ క్రూడ్ ధరతో మనకి సంబంధం లేకుండా చేశారు. ఇప్పుడేమో అంతర్జాతీయంగా ధర పెరిగిందంటూ నడ్డిపైనా..వీపు పైనా ఎక్కడ వీలైతే అక్కడ వాతలు పెడుతున్నారు.
ఏతావాతా చెప్పొచ్చేదేమింటంటే.. ఓవైపు రా మెటీరియల్స్ బాగా పెరగిపోవడం, ఇంధన ధరలు రికార్డ్ స్థాయిలో పెరగడం సామాన్యుడితో పాటు స్టాక్ మార్కెట్లోని కంపెనీలకు కూడా భారంగా మారుతుందనేది బ్యాంక్ ఆఫ్ అమెరికా రీసెర్చ్ సంస్థ ఘంటాపథంగా చెప్తోన్న మాట 

Expert's View


MTAR Technologies కాసుల వర్షం కురిపిస్తుందా?

Trending