బూతు కంటెంట్‌కి అడ్డాగా మారిన క్లబ్‌హౌస్...? కలకలం రేపుతోన్న వీడియో వ్యవహారం

2021-12-04 10:59:35 By Anveshi

img

నవంబర్ 28..ట్విట్టర్‌‌లో ఓ వీడియో హోరెత్తిపోయింది. క్లబ్‌హౌస్‌ రూమ్‌లో ఓ గ్రూపు చేసిన నిర్వాకంతో పెద్ద కలకలమే రేగింది.అది క్లోజ్డ్ గ్రూప్ రూమ్స్ కావడంతో వెంటనే బైటికి రాలేదు కానీ..అందులో చోటు చేసుకున్న సంభాషణలు, ఇతర కార్యక్రమాలు జుగుప్సాకరంగా, అసభ్యంగా ఉండటంతో ఇప్పుడు క్లబ్‌హౌస్ యాప్ పై తీవ్రంగా దుమారం రేగుతోంది

 

సింగిల్‌పూర్ అనే ఓ రూమ్‌లో మెంబర్లుగా ఉన్న పురుషులు..మహిళలపై అసభ్యపదజాలంతో చాట్ చేయడమే కాకుండా వారి  బాడీ పార్ట్స్‌ని వేలం వేస్తున్నట్లు సంభాషణ అంతా ఉండటంతో అందులోని లేడీస్ కూడా బైటికి వచ్చి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.నేను ఫలానా స్త్రీకి ఐదు రూపాయలు పే చేస్తా అనడం, ఆమె అందుకు కూడా అర్హత లేదంటూ మరొకడు నోరు పారేసుకోవడం వంటి అనేక
అభ్యంతరకర సంభాషణ అంతా ఈ గ్రూపులో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన రెండు నిమిషాల వీడియో సర్క్యులేట్ అవుతోంది

 

కరోనా సమయంలో లాక్‌డౌన్ కారణంగా కొన్ని యాప్స్‌కి భారీగా గిరాకీ పెరిగింది. ఆ సమయంలోనే ఈ క్లబ్‌బౌస్ అనే యాప్ లాంఛ్ అయింది దీనికి కో ఫౌండర్లుగా రోహన్ సేథ్, ఆరతి రామమార్తి, ఇంటర్నేషల్ హెడ్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ రూమ్‌లో జరిగిన ఈ బూతు సంభాషణ వ్యవహారం అంతా క్లబ్‌హౌస్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌కి వ్యతిరేకం  అని..అందుకే కంప్లైంట్ చేస్తున్నట్లు స్వాతి కుమార్ అనే లేడీ ప్రకటించింది.

 

2020లో లాంఛ్ అయిన ఈ యాప్‌కి ఇప్పుడు ఆండ్రీస్సెన్ హోరోవిట్జ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తున్నారు. దాదాపు 4 బిలియన్ డాలర్ల వేల్యేషన్ లభించిన ఈ యాప్ ఇప్పుడు క్రమంగా ఆదరణ కోల్పోతోంది. జూన్ నెలలో 59లక్షల డౌన్లోడ్లు జరగగా, అక్టోబర్‌లో 2,62,000వేలకు పడిపోయింది.కంపెనీ చాట్, రికార్డింగ్ ఆప్షన్స్ వంటి ఫీచర్స్ రోలవుట్ చేయడంలో నెమ్మదిగా ఉండటంతో ఇలా ఆదరణ కోల్పోయినట్లు చెప్తున్నారు. అంతేకాదు అసలు ఈ టైప్ యాప్స్ జనాలు ఇళ్లకే పరిమితమైన సమయంలో మాత్రమే ఆదరణ పొందాయ్. 

 

మొత్తం 18+ ఏజ్ గ్రూప్ రూమ్స్‌ అడల్ట్ కంటెంట్‌తో పాటు హెరాస్‌మెంట్‌కి వేదికగా మారుతుండటంతో..మెల్లగా జనం ఈ యాప్‌పై మోజు పడటం మానేసారని క్లియర్ గా అర్ధమవుతోంది.

2021లో ఎలాన్ మస్క్ ఓసారి ఈ రూమ్స్‌లో పార్టిసిపేట్ చేయడంతో ఒక్కసారిగా పాపులారిటీ పెరిగినా, తర్వాత ఆ స్థాయిని నిలబెట్టుకోలేకపోయింది.అయితే ఎలా చూసినా కూడా ఈ క్లబ్‌హౌస్ అనేది చివరికి ఓ పోర్న్‌హబ్‌గానే ఎక్కువమంది చూశారు. దానికి తోడు అసలు కమ్యూనటీ గైడ్‌లైన్స్ అనేవే లేకుండా పోయాయని ఓ యూజర్ ఈ సందర్భంగా తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

 

మనీకంట్రోల్ స్టోరీ ప్రకారం, అసలు ఇప్పుడు ఈ యాప్ తన యూజర్ల బేస్ పెంచుకోవడానికి ఎలాంటి రూల్స్ మట్టిగడ్డా లేవని అర్ధమైంది..ఏ సోషల్ మీడియా కంపెనీ అయినా..న్యూడ్ ఫోటోలను కనీసం
ప్రొఫైల్ ఫోటో వరకైనా అంగీకరించవ్..కానీ ఇందులో అలాంటివేం లేదు..ఎవడికి ఇష్టం వచ్చినట్లు వాడు బిహేవ్ చేయవచ్చన్నట్లుగా యాప్‌‌లో కంటెంట్ ఉంటుంది. ఈ క్లబ్‌హౌస్ గురించి మనీకంట్రోల్ దాదాపు గంటకి సరిపడా కథనమే రాసింది. దాని సారాంశం ఒక్కటే. తొందర్లోనే ఈ యాప్ ఇండియాలో బ్యాన్ అయినా అవ్వొచ్చు
 


CLUBHOUSE ROOM PORN