సింగిల్ డే బిగ్గెస్ట్ లాస్ ! 1416 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, నిఫ్టీ 431 పాయింట్ల పతనం

2022-05-19 16:27:09 By Anveshi

img

మార్కెట్లు ఆర్ధిక మందగమనం వార్తలతో  అల్లల్లాడిపోయి చివరకు భారీ నష్టాలతో ముగిశాయ్ నిఫ్టీ 431 పాయింట్లకిపైగా కోల్పోయి 15809 పాయింట్ల వద్ద పతనం నిలిచింది. సెన్సెక్స్ 1416 పాయింట్ల నష్టపోయి 52792 పాయింట్ల వద్ద ముగిసింది

 

ఐటీ మెటల్స్ చెరో ఐదున్నరశాతం వరకూ నష్టపోగా మిగిలిన అన్ని రంగాలదే అదే పరిస్థితి. ఒక్క ఎఫ్ఎంసిజి మాత్రమే అరశాతం నష్టంతో తప్పించుకుంది

 

టాప్ గెయినర్లుగా ఐటిసి డా.రెడ్డీస్, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ వరసగా 3.32శాతం, 0.61శాతం, 0.18శాతం లాభపడ్డాయ్.లూజర్లలో విప్రో,హెచ్ సిఎల్ టెక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టిసిఎస్ అన్నీ ఐదుశాతానికిపైగా నష్టపోయాయ్

 

ఇక రేపు వారాంతం కావడంతో ఈ అమ్మకాలు ఆగుతాయో కొనసాగుతాయో చెప్పలేని పరిస్థితి. మరోసారి నిఫ్టీ 15800 స్థాయికి దిగిపోగా అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో 324-1627గా ఉంది.

 


sensex nifty