గోధుమల ఎగుమతిపై నిషేధం : తక్షణం అమల్లోకి..! ఎప్పుడో తీసుకోవాల్సింది !

2022-05-14 11:15:35 By Anveshi

img

ద్రవ్యోల్బణం దెబ్బ అంటే  ఏంటో కేంద్రానికి ఇప్పుడు అర్ధమైనట్లుంది..చేతులు బాగా కాలిపోయాక కూడా  ఏ ఆకు పసరు పూసుకుంటే బావుంటుందని తీరిగ్గా ఆలోచిస్తోంది. అన్ని ఉత్పత్తుల ధరలు పతాకస్థాయికి చేరిన తర్వాత గోధుమల ఎగుమతులపై నిషేధం విధించింది.  

 

ఐతే ఇప్పటికే ఎగుమతుల కోసం ఎల్ఓసి ఉన్న కన్‌సైన్‌మెంట్లు మాత్రం ఎక్స్ పోర్ట్ చేసుకోవచ్చని వెసులుబాటు కల్పించింది

 

ఈ గోధుములకు సంబంధించి ఎలాంటి ఎగుమతి ఒప్పందమైనా ఇక మే 13 తర్వాత జరిగినవి లెక్కలోకి తీసుకోరు

 

రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత గోధుమల రేటు ప్రపంచవ్యాప్తంగా 40శాతం ధర పెరిగింది. మరోవైపు మన దేశం నుంచి ఎగుమతులు కూడా పెరిగాయి. ఈ పరిణామం చోటు చేసుకుని దగ్గర దగ్గర రెండు నెలలు అయింది. ఐనా కూడా చోద్యం చూస్తూ, ఇప్పుడు నిషేధం విధించడంతో రేటు తగ్గడంపైన పెద్దగా ఆశలేం లేవ్. దీనికి తోడు రబీ పంట బాగా తక్కువ వస్తుందని ప్రచారం సాగుతోంది.

ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం కనీసం నెల ముందు తీసుకున్నా, ఉన్న నిల్వలకు వచ్చే పంట కూడా తోడై దేశీయంగా అవసరాలను తీర్చేదని,  ఇప్పుడు తీసుకున్న నిర్ణయం వలన ప్రయోజనం ఎంత ఉంటుందో రాబోయే రోజుల్లో తేలుతుంది

 

1901 తర్వాత ఆ స్థాయి ఎండలు ఉండటంతో ఇప్పుడు గోధుమ పంట దిగుబడి తీవ్రంగా తగ్గనుంది. కనీసం 10-50శాతం వరకూ దిగుబడిపై  ప్రభావం ఉంటుందని అంచనా. మరోవైపు కంపెనీలేమైనా తగ్గుతాయా అంటే అదీ లేదు..మార్జిన్లు మెయిన్ టైన్ చేయడం కోసం రేటు పెంచుతామంటూ బహిరంగంగానే చెప్తున్నాయ్.

 

2021-22  మధ్యలో 70లక్షల టన్నుల గోధుమ భారత్ ఎగుమతి చేసింది. వాటిలో ఒక్క ఏప్రిల్ నెలలోనే 14లక్షల టన్నులు ఉన్నాయంటే, ఇక దేశంలో నిల్వల పరిస్థితిపై ఓ అంచనాకి రావచ్చు. సో..చదువరులకు ఆశీర్వాద్ గోధుమపిండి రేటు ఇప్పుడెంత ఉందో గుర్తుపెట్టుకుంటే, పది రోజుల్లో దాని రేటుపై ఓ అంచనా వచ్చేస్తుంది

 


Expert's View


ఏ దేశ ద్రవ్యోల్బణం చూసినా ఏముంది గర్వకారణం ?

Trending