టీకా వేసుకున్నారా..! ఐతే మీకు ఎక్స్‌ట్రా వడ్డీ ఇస్తాం ! బంపర్ ఆఫర్ ఇస్తోన్న బ్యాంక్

2021-04-13 18:12:45 By Anveshi

img

కరోనా కాలంలో వ్యాక్సినేషన్‌ స్లోగా సాగుతుందంటూ విమర్శలు వస్తున్నాయ్. ఐతే ఈ మద్య అది కాస్త తగ్గి నో స్టాక్ బోర్డులు పెట్టేంతవరకూ వ్యవహారం వచ్చింది. ఐనా సరే ఇంకా చాలామంది కరోనా టీకా తీసుకునేందుకు వెనుకాడుతూనే ఉన్నారు. ఇలాంటి సమయంలోనే ఇంతకి మించిన అవకాశం లేదనుకుందో, లేక తానూ కరోనాపై పోరాటంలో భాగం అవుదామనుకుందో కానీ, సెంట్రల్ బ్యాంక్ ఆప్ ఇండియా ఓ స్కీమ్ ప్రారంభించింది.


ఇమ్యూన్ ఇండియా డిపాజిట్ స్కీమ్ కింద 1111 రోజుల పాటు, టీకా తీసుకున్నవారికోసం స్పెషల్ ఎక్స్‌ట్రా వడ్డీ ఆఫర్  ప్రకటించింది. ఇప్పుడున్న వడ్డీరేటుకు అదనంగా 25బేసిస్ పాయింట్లు వడ్డీ చెల్లిస్తామని ప్రకటించింది. సీనియర్ సిటిజెన్ ఖాతాలకు కూడా ఇది వర్తిస్తుందని తెలిపింది.సెంట్రల్ బ్యాంక్ ఆప్ ఇండియా బ్యాంక్ ట్విట్టర్‌లోనే స్వయంగా ఈ ప్రకటన జారీ చేసింది


అందరు పౌరులు వ్యాక్సిన్ వేయించుకోవాలని, అలానే తమ డిపాజిట్లపై అదనపు వడ్డీని కూడా పొందండంటూ ఊరిస్తోంది. ఐతే ఇది లిమిటెడ్ పీరియడ్ వరకే వర్తిస్తుందని చెప్పింది. అయినా 1111 రోజులు అంటే తక్కువ గడువేం కాదు. మూడేళ్లకి పైబడే ఉంటుంది. మరి ఈ స్కీమ్‌కి అర్హత అంటే వ్యాక్సిన్ వేయించుకున్నవాళ్లందరూ అర్హులే. మిగిలిన వివరాలు కోసం బ్యాంకులకు క్యూ కడితే సరి..! ఏదేమైనా వ్యాక్సినేషన్‌ని ప్రోత్సహించేందుకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలా స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టడం మంచి విషయమే..!

 

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం మార్కెట్లలో 7.10శాతం లాభపడి రూ.18.10వద్ద ముగిసింది.
 


central bank of india immune deposit scheme vaccination covid 19 share telugu trade profit ????? ????? ?????? ????? ??????????

Expert's View


ఒక స్టాక్ మల్టీ బ్యాగర్ అవ్వటానికి 20 సంవత్సరాలు పడుతుందా ?

Trending