కేపిటల్ గూడ్స్‌కి టైమ్ వచ్చింది..! 50%-200% పెరిగిన ఈ పదమూడే కాదు..ఇంకా రేసు గుర్రాలున్నాయట..!

2022-01-14 08:13:01 By Anveshi

img

దాదాపు 14ఏళ్ల తర్వాత కేపిటల్ గూడ్స్ స్టాక్స్‌కి టైమ్ వచ్చిందంటూ టెక్నికల్ అనలిస్టులు చెప్తున్నారు. కొన్ని స్టాక్స్ ఆల్రెడీ ఈ దిశగా పరుగులు పెడుతుండగా, కొన్ని ఇప్పుడిప్పుడే ట్రెండ్ ‌ఫాలో అవుతున్నాయ్. 

 

లాంగ్ టర్మ్ రివార్డ్ కేటగరీలో కొన్నేళ్లుగా సైడ్‌లైన్ అయిన ఈ స్టాక్స్‌ ఇక ఇప్పుడు మంచి రిటన్స్ ఇస్తాంటూ ఎలారా కేపిటల్‌కి చెందిన బిజూ శామ్యూల్ చెప్తున్నారు. చాలా స్టాక్స్ బ్రేకవుట్‌ తీసుకోగా, లాంగ్ టర్మ్‌లో వీటి ఫీజిబులిటీ అద్భుతంగా ఉందంటూ ఊరిస్తున్నారాయన

 

కేపిటల్ గూడ్స్ స్టాక్స్ 2001 నుంచి 2007 వరకూ మంచి ర్యాలీ చేశాయ్. ఐతే 2009 మార్చిలో కరెక్షన్‌తో ఆ ర్యాలీకి బ్రేక్ పడింది. ఈ మధ్య కాలంలో కేపిటల్ గూడ్స్ ఇండెక్స్ 2550శాతం పెరిగింది. 2010-2021 మధ్యలో ఈ సెక్టార్ కేవలం 101శాతం మాత్రమే లాభపడింది. ఇదే సమయంలో నిఫ్టీ 253శాతం ర్యాలీ చేసింది

నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ అనే ఓ బృహత్తరపథకం అమలులో ఉన్నాళ్లూ..ఈ కేపిటల్ గూడ్స్ ర్యాలీకి  బ్రేక్ పడదేనేది కొందరి నమ్మకం. ప్రభుత్వం రైల్వే, మౌలిక వసతులు, రహదారులు, నిర్మాణ రంగంలోకి ఎక్కువగా నిధులను ఖర్చు పెట్టబోతోంది. ఇది ప్రవేట్ రంగంలోనిది కావచ్చు..ప్రభుత్వమే ఖర్చు పెట్టవచ్చు. ఎలాగైనా డబ్బులు మాత్రం అత్యధిక స్థాయిలో పరవళ్లు తొక్కబోతోందనేది వాస్తవం

 

దీనికి తోడు ప్రధానమంత్రి గతిశక్తి మాస్టర్ ప్లాన్ పేరిట ఓ సమగ్రమైన మౌలికవసతుల అభివృద్ధి ప్రణాళిక తీసుకువచ్చారు కాబట్టి ఈ రంగంలోని కంపెనీలకు నిధులకు , ప్రాజెక్టులకు ఢోకా ఉండదేది మోతీలాల్ ఓస్వాల్ సహా పలు రీసెర్చ్ కంపెనీలు కూడా చెప్తున్న మాట


capital goods