ముకేశ్ అంబానీకి షాక్ .! బోర్డులోకి సౌదీ కింగ్ ఆగమనమంపై అడ్డుపుల్ల ! చట్టవిరుద్ధమంటూ సంచలనం కలిగించిన పెన్షన్ ఫండ్

2021-09-25 12:23:03 By Anveshi

img

రిలయన్స్ సంస్థ కథ ఇప్పుడు రసకందాయంలో పడింది. గత ఏడాది రికార్డు స్థాయిలో లక్షన్నర కోట్లకిపైగా పెట్టుబడులు రాబట్టి..ది మోస్ట్ అట్రాక్టివ్ కంపెనీ ఆన్ ది ఎర్త్‌గా 2020లో రిలయన్స్‌ని మార్చిన ముకేష్ అంబానీ ఇప్పుడు పెద్ద చిక్కుల్లో పడ్డారు.

 

రిలయన్స్ బోర్డ్‌లోకి సౌదీ ఆరామ్ కో ఛైర్మన్,  కింగ్-యాసిర్ అల్ రుమయ్యాన్‌ని తీసుకురావడం ద్వారా తన కంపెనీని వరల్డ్ వైడ్ స్టాండర్డ్స్ ఉన్న కంపెనీగా మార్చాలనేది ముకేష్ అంబానీ ప్లాన్. అందుకోసం సౌదీఆరామ్‌కోతో పెద్ద డీల్ సెట్ చేయడంలో గత రెండేళ్లుగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆ కంపెనీతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకోవడం, రిలయన్స్‌లో వాటాతో పాటు, బోర్డులో మెంబర్‌గా సౌదీ కింగ్‌ని తీసుకురావడం వంటి లక్ష్యాలు పెట్టుకున్నారు.( ప్రాఫిట్ యువర్ ట్రేడ్)

 

గత ఏడాది రిలయన్స్‌లో భారీగా పెట్టుబడులు పెట్టిన సంస్థల్లో కాలిఫోర్నియా స్టేట్ టీచర్స్ రిటైర్ మెంట్ సిస్టమ్స-CalSTRS, అనే ఫండ్ కూడా ఉంది. దీని ద్వారానే  రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్‌లో రూ.11367 కోట్లు,  రిటైల్ సంస్థల్లోకి 9555కోట్లు వచ్చాయ్. 

 

ఐతే ఈ డీల్‌తో సంబంధం లేకుండానే సౌదీఆరామ్‌కోతో రిలయన్స్ ఈక్విటీలోని 20శాతం వాటా విక్రయం కోసం ముకేశ్ ప్రయత్నిస్తున్నారు. దీని కోసమే  బోర్డులోకి రావాలంటూ ముకేశ్  యాసిర్ ఆల్ రుమయ్యాన్‌ని కోరుతున్నారు.


ఐతే ముందు చెప్పిన పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ ఇక్కడే తెరపైకి తన అభ్యంతరాన్ని తీసుకువచ్చింది. సౌదీఅరేబియా పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ కి యాసిర్ ఓ వైపు గవర్నర్‌గా ఉన్నారని. అలాంటప్పుడు ఆయనే మళ్లీ రిలయన్స్‌లో డైరక్టర్‌గా (ఇండిపెండెంట్) గా ఎలా మారతారని..ఇది కుదరదంటూ పేచీ పెడుతోంది.( ప్రాఫిట్ యువర్ ట్రేడ్)

 

జూన్,30,2020 నాటికి కాలిఫోర్నియా ఫండ్‌కి రిలయన్స్‌లో 53లక్షల ఈక్విటీ షేర్లున్నాయి. ఇక ఇదే ఫండ్‌కి మొత్తం అసెట్స్ 318.4 బిలియన్ డాలర్లుగా అంచనా  ఫండ్ అభ్యంతరం వెనుక గ్లాస్ లూయీస్ అండ్ కంపెనీ అడ్వైజరీ సంస్థ రిపోర్ట్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఓ వైపు ఆరామ్‌కో, మరోవైపు పెన్షన్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ రెండింటిలోనూ యాసిర్ కీలక పాత్ర పోషిస్తున్నారు.ఇలాంటి నేపధ్యంలో ఆయన ఇంకే సంస్థలో స్వతంత్ర హోదాలో డైరక్టర్‌గా ఉండటం కుదరదని గ్లాస్ లూయీస్ అండ్ కంపెనీ చెప్తోంది. ఇండియన్ లా ప్రకారం కూడా ఇది కుదరదని నిర్ద్వంద్వంగా తన నివేదికలో చెప్పిన మేరకే, కాలిఫోర్నియా ఫండ్ తన అభ్యంతరాన్ని బైటపెట్టిందంటున్నారు. ( ప్రాఫిట్ యువర్ ట్రేడ్)

 

ఐతే రిలయన్స్ మాత్రం, సౌదీ కింగ్ చేసిన పెట్టుబడి, డైరక్ట్‌గా రిలయన్స్‌లో కాదని, రిలయన్స్ సబ్సిడరీ సంస్థలో మాత్రమే కాబట్టి..ఆయన స్వతంత్ర డైరక్టర్ హోదాకి వచ్చిన భంగం లేదని చెప్తోంది.

 

సో..రాబోయే రోజుల్లో ఇదో పెద్ద సంచలనమే కలిగించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ వివాదాన్ని ముకేశ్ అంబానీ ఎలాగ పరిష్కరించుకుంటారనేది ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది

 

(ఇది పూర్తిగా ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సొంతమైన కథనం, అనుసరణ చేసినా, కాపీ కొట్టినా సోషల్ మీడియాలో అపహాస్యం పాలు కాకతప్పదు)


KING SAUDI ARAMCO CHAIRMAN YASIR AL RUMAYYAN CALSTRS FUND PENSION

Expert's View


ఇన్వెస్టర్లకు ఎనలిస్టుల "దసరా మాములు" స్టాక్ రెకమెండేషన్స్

Trending