ఈ 2 ఫార్మా స్టాక్స్‌ కొనండంటున్న బ్రోకింగ్ రీసెర్చ్ సంస్థలు ! మినిమమ్ 20% రిటన్ గ్యారంటీ అంటూ ఊరిస్తున్న ఏజెన్సీలు

2021-05-18 12:57:33 By Anveshi

img


ప్రస్తుతం ఫార్మా స్టాక్స్‌కి స్టాక్ మార్కెట్లలో..వాటి మందులకు ఓపెన్ మార్కెట్లలో మంచి డిమాండ్ కన్పిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ నేపథ్యంలోనే రెండు స్టాక్ బ్రోకింగ్ ఏజెన్సీలు చెరో స్టాక్‌ని రికమండ్ చేశాయ్. ఆనంద్ రాఠీ సెక్యూరిటీస్ ఆర్తి డ్రగ్స్‌ను రికమండ్ చేయగా సెంట్రమ్ బ్రోకింగ్ డా.రెడ్డీస్ ల్యాబరేటరీస్ షేరును కొనుగోలు చేయమని చెప్పింది. ఆ వివరాలు మీరూ చదవండి

 

రికమండ్ చేసిన బ్రోకింగ్ సంస్థ : ఆనంద్ రాఠీ సెక్యూరిటీస్
కొనండి ఆర్తి డ్రగ్స్ @రూ.759.95
టార్గెట్ @ రూ.949


1984లో స్థాపించిన ఆర్తి డ్రగ్స్ స్మాల్‌క్యాప్ కేటగరీలోకి వస్తుంది. దీని మార్కెట్ కేపిటలైజేషన్ రూ.7057.57కోట్లు. క్యు4లో సంస్థ ఆదాయంలో 5.55శాతం క్షీణత నమోదు అయి రూ.502.72కోట్లకి పరిమితం అయింది. గతేడాది ఇదే సమయంలో  ఇది రూ.532.5కోట్లుగా ఉంది. నికరలాభం రూ.51.65కోట్లు ఆర్జించినట్లు కంపెనీ ప్రకటించింది. ఐతే స్ట్రాంగ్ బిజినెస్  మొమెంటమ్‌తో పాటు మార్జిన్లు ఎక్కువ వచ్చే వ్యాపారంలో కొత్తగా నిధులు పెట్టడం సంస్థకి కలిసి వస్తుందని ఆనంద్ రాఠీ  సెక్యూరిటీస్ అంచనా వేసింది. దీంతో  రానున్న రెండేళ్లలో సేల్స్ /ఎబిటా/నికరలాభం మూడూ వరసగా 19శాతం, 22.6శాతం,  25.6శాతం వృద్ధి నమోదు అవుతుందని లెక్కగట్టింది. దీంతో స్టాక్ ప్రస్తుతం  FY22ఎర్నింగ్స్, FY23 ఎర్నింగ్స్‌తో పోల్చితే  20.3 రెట్లు, 15.8 రెట్లు ధర వద్ద ట్రేడవుతున్నట్లు చెప్పింది. 

 

రిస్క్ : ఉత్పత్తి సామర్ధ్యం పెంచడంలో ఆలస్యం, జెనెరిక్ మెడిసిన్ల విభాగంలో గట్టి పోటీ , తత్ఫలితంగా ఏపీఐ ధరల క్షీణత

 

 

ఇక సెంట్రమ్ బ్రోకింగ్ రికమండ్ చేసిన డా.రెడ్డీస్ స్టాక్ గురించి చూద్దాం

కొనండి డా.రెడ్డీస్ @5275.95
టార్గెట్ రూ.6400

లార్జ్ క్యాప్ కంపెనీ అయిన డాక్టర్ రెడ్డీస్ మార్కెట్ కేపిటలైజేషన్ రూ.87734.71కోట్లు, క్యు4లో మొత్తం రూ.4850.80కోట్ల  ఆదాయం ఆర్జించింది.ఇది గతేడాది ఇదే క్వార్టర్‌లో రూ.5012.40కోట్లతో పోల్చితే 3.22శాతం తక్కువ.  క్యు4లో నికరలాభం రూ.539.40కోట్లు

 

డాక్టర్ రెడ్డీస్ ఫ్యూచర్‌లో చాలా బ్రాండ్లని చేజిక్కించుకునే వ్యూహంలో ఉంది, స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ కలిగిన డా.రెడ్డీస్‌కీ కీ అసెట్స్  gNuvaring CRL, gCopaxone CRLకి అమెరికా నుంచి అనుమతులు రానున్నాయ్. విదేశీ డ్రగ్ రెగ్యులేటరీ సంస్థ  ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న డా.రెడ్డీస్ ఉత్పత్తులు వాటికి అనుమతులు ఉండటం సంస్థకి పెట్టని కోట.దీంతో ఈ స్టాక్‌ని ప్రస్తుత మార్కెట్ ధర వద్ద కొనుగోలు చేస్తే కనీసం 20శాతంపైనే రిటన్స్ వస్తాయని సెంట్రమ్ బ్రోకింగ్ సంస్థ రికమండ్ చేసింది

 

( పై రెండు స్టాక్ రికమండేషన్స్ ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సైట్‌వి కాదు, ఇన్వెస్టర్ల లాభనష్టాలకు వారే బాధ్యులు)


centrum anand rathi broking research agency recommendation buy sell dr.reddy labs arthi drugs telugu profit trade

Expert's View


నేను వేసుకున్న కోటు రంగు , రానున్న రోజుల్లో మార్కెట్ల రంగు ఇదేనా ?

Trending