నిన్న విడుదలైన ఆర్థిక ఫలితాల్లో ఐటిసి అదరగొట్టిందేం లేదు. బంపర్ ప్రాఫిట్ రికార్డ్ చేసిందీ లేదు, ఐనా సరే ఇవాళ్టి మార్కెట్లలో ఓ రేంజ్ దూకుడు ప్రదర్శించింది. అంతా చేసి పెరిగింది నాలుగో, ఐదోశాతమే కావచ్చు కానీ ఈ మధ్యకాలంలో ఈ మాత్రం పెరిగిందైనా లేకపోవడంతోనే ఈ హంగామా అంతా కూడా..!
ఇవాళ స్టాక్ మార్కెట్లు నిట్టనిలువునా నేలమట్టానికి సగంలో ఆగి, రెండున్నరశాతం నష్టపోయాయ్.5శాతం ఓపెనింగ్‌లోనే నష్టపోతే వెంటనే డౌన్ సీల్ పడేవి. కానీ ఆ ప్రమాదం లేదు కాబట్టి ట్రేడింగ్ సాగుతూ
మధ్యాహ్నం 3 గంటలకు సెన్సెక్స్ 1500 పాయింట్లు, నిఫ్టీ 440 పాయింట్లు నష్టపోయాయ్. ఐతే ఐటీసి మాత్రం ఎక్కడా తగ్గకుండా ఏకంగా మూడేళ్ల గరిష్టస్థాయికి చేరడం గమనార్హం. ఇంట్రాడేలో ఈ స్టాక్ రూ.279.25 ధరకి చేరింది. ఆ తర్వాత రూ.282.95ని కూడా టచ్ చేసింది. ఇది జులై 2019 నాటి స్థాయి
ఎన్ఎస్ఈలో రూ.276, బిఎస్ఈలో రూ.274.50 వద్ద ప్రస్తుతం స్టాక్ స్టెడీగా ఉంది
2022 నాలుగో త్రైమాసికపు నికరలాభంలో 12 శాతం వృద్ధితో రూ.రూ.4191 కోట్ల రాబడిని ఆర్జించిన ఐటిసి అన్ని విభాగాల్లో గణనీయమైన వృద్ది నమోదు చేసింది.మొత్తంగా రూ.17754 కోట్ల ఆదాయం గడించగా, సిగరెట్ల విభాగపు అమ్మకాల్లో 10శాతం వృద్ధి నమోదు చేయడమే ఇవాళ్టి జోరుకి కారణమనేవారున్నారు. ఓవైపు ధరల పెరుగుదల ఉన్నా కూడా తమ ఎప్ఎంసిజి ఉత్పత్తులు భారీగా అమ్ముడుపోయాయని ఐటిసీ ప్రకటించింది
కొన్ని ICICI డైరక్ట్ లాంటి బ్రోకరేజీ సంస్థలు , ఐటిసి రూ.310 వరకూ వెళ్తుందని, ఎడెల్వైజ్ సెక్యూరిటీస్ రూ.325 వరకూ వెళ్తుందని ఊరించడం గమనార్హం. మార్కెట్లలో అన్ని షేర్లకు దబిడి దిబిడి అవుతున్న వేళ ఇలాంటి కాల్స్ చూసి తొందరపడితే కోలుకోవడానికి మరో ఏడాది కాలం ఆగాల్సి వచ్చినా రావచ్చు..