టిప్పింగ్ పాయింట్‌కి చేరుకుందా..? తాడో పేడో తేలిపోనుందా..?

2021-03-02 11:46:44 By Anveshi

img

ఇది మోస్ట్ హేపెనింగ్ మూమెంట్..టిప్పింగ్ పాయింట్‌కి వచ్చేసింది.తాడో పేడో తేల్చుతుందా..లేక ఇదే రకమైన మిస్టరీ ట్రెండ్ కొనసాగుతుందా అనేది
తొందర్లోనే తేలబోతోందట..! ఇది గత రెండు వారాలుగా టెన్షన్ క్రియేట్ చేస్తోన్న బిట్ కాయిన్ విషయంలో సిటీ గ్రూప్ చెప్తోన్న మాట.  హయ్యర్ లెవల్స్ నుంచి దాదాపు 20శాతం కరెక్ట్ అయిన బిట్ కాయిన్ సోమవారం 7శాతం పెరిగింది. కొన్ని దేశాల్లో అయినా బిట్ కాయిన్ ఇంటర్నేషన్ ట్రేడ్‌లో కరెన్సీగా అనుమతించవచ్చనే అంచనాలు చక్కర్లు కొడుతున్నాయ్. 

ఓ వైపు గోల్డ్‌మేన్ శాక్స్,  క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ డెస్క్ రీస్టార్ట్ చేసింది. వచ్చే వారం నుంచి బిట్ కాయిన్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఆరంభించబోతోందని ప్రచారం సాగుతోంది. ఈ మేరకు రాయిటర్స్ ఓ స్టోరీ కూడా పబ్లిష్ చేసింది.  టెస్లా, మాస్టర్ కార్డ్ సహా కొన్ని దిగ్గజ కంపెనీలు ట్రాన్సాక్షన్స్‌కి అనుమతి ఇవ్వడంతో బిట్ కాయిన్  ఇప్పుడు టిప్పింగ్ పాయింట్‌కి చేరిందని సిటీ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ తన నివేదికలోతెలిపింది

టిప్పింగ్ పాయింట్‌లో బిట్‌కాయిన్

నెక్స్ట్ వీక్ ఓపెన్ కానున్నఫ్యూచర్స్ ట్రేడింగ్

మరింత దూసుకుపోతుందా..?


ఫిబ్రవరి నెలలో 58,354 డాలర్లకు చేరిన బిట్ కాయిన్, వేల్యూ ఆ తర్వాత పడుతూ వచ్చింది. ఈ దశలో సిటీ గ్రూప్ ఇలాంటి అంచనా వెలువరించడం ఆసక్తి కలిగించే పరిణామం.  ఐతే బిట్‌కాయిన్ లావాదేవీలకు పూర్తిగా యాక్సెప్టెన్స్ వచ్చే దారిలో చాలా అడ్డంకులు ఉన్నాయని కూడా హెచ్చరించింది. డిజిటల్ వాలెట్ల ద్వారా వ్యాపార సంస్థలతో పాటు, వ్యక్తులకు కూడా ఈ క్రిప్టో కరెన్సీ వాడకం అందుబాటులోకి వస్తే, క్విక్ పేమెంట్ కోసం బిట్ కాయిన్ ఓ పటిష్టమైన నెట్‌వర్క్ అవుతుందని సిటీ గ్రూప్ అభిప్రాయపడింది ఐతే తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనయ్యే బిట్‌కాయిన్  పేమెంట్ టూల్‌గా మెజారిటీ దేశాలు అంగీకరించలేదు. అనుమతించలేదు. ఐతే నైజీరియాలాంటిచిన్న చిన్న దేశాల్లో మాత్రం ఇది బాగా వర్కౌట్ అవుతోంది. 
 

Expert's View


WHAT IS BITCOIN ? HOW TO INVEST IN CRYPTO CURRENCY ?

Trending