27ఏళ్ల కాపురంలో కలతలు.. ఎవరికి వారే

2021-05-04 08:45:27 By Y Kalyani

img

27ఏళ్ల కాపురంలో కలతలు.. ఎవరికి వారే

ప్రపంచవ్యాపార రంగంలోనే తనకు తానేసాటిగా నిరూపించుకున్నారు. టెక్నాలజీలో విండోస్ ద్వారా సరికొత్త చరిత్రను రాసింది బిల్ గేట్స్ అయితే..  ఆయన సహచరిగా, ఫౌండేషన్ ద్వారా దాత్రుత్వంలో తిరుగులేని పేరుప్రఖ్యాతులు సంపాదించారు మిలిందా గేట్స్. వాళ్లద్దరిని చూసి చాలామంది ఆదర్శ దంపతులు అనేవారు. ఏమైందో ఏమోగానీ వాళ్లిద్దరే ఇప్పుడు విడిపోతున్నారు. 27ఏళ్ల బంధానికి వీడ్కోలు పలుకుతున్నారు. విడిపోతున్నారు బిల్‌గేట్స్‌ దంపతులు. మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ సతీమణి మెలిందా విడాకులు తీసుకుంటున్నారు. తమ 27 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నట్లు సోమవారం అర్ధరాత్రి దాటాక ట్విటర్‌లో విడాకుల విషయాన్ని ప్రకటించారు. మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడిగానే కాకుండా పలు ధార్మిక కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ చూరగొన్న ఈ జంట విడిపోవటం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేసింది.
వాళ్ల ప్రకటన సారాంశం...
ఎన్నో సమాలోచనలు, ఎంతో మథనం తర్వాత మా వైవాహిక బంధాన్ని తెంచుకోవాలని నిర్ణయానికి వచ్చాం. గత 27 ఏళ్లలో మేము ముగ్గురు అత్యద్భుతమైన పిల్లలను తీర్చిదిద్దాం. దాంతోపాటు ప్రపంచలోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, నిర్మాణాత్మకంగా ఎదిగేలా మా ఫౌండేషన్‌ ద్వారా కృషి చేశాం. ఈ మిషన్‌లో మా భాగస్వామ్యం  ఎప్పటికీ కొనసాగుతుంది. కానీ భార్యాభర్తలుగా ఇక కొనసాగలేమని భావించాం. కొత్త ప్రపంచంలోకి మేం వెళ్లేందుకు వీలుగా, మా వ్యక్తిగత  ఆకాంక్షలను, మా విడాకుల నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాం.


billgates milindagates family divorce microsoft

Expert's View


ఒక స్టాక్ మల్టీ బ్యాగర్ అవ్వటానికి 20 సంవత్సరాలు పడుతుందా ?

Trending