ఫ్రాంచైజ్ మోడల్‌తో ముందుకెళ్లనున్న బాటా..! ఆదాయం పెంచుకునే రెవెన్యూ మోడల్ ఇదేనంటూ ఉవాచ

2021-12-04 13:35:23 By Anveshi

img

రిటైల్ ఎక్స్‌పాన్షన్ విషయంలో త్రీ టైర్, ఫైవ్ టైర్ సిటీస్‌కి విస్తరించేందుకు వ్యూహాలు పన్నుతున్నట్లు బాటా ఇండియా సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ సందర్భంలోనే ప్రకటించింది. ఇప్పుడు అందుకు తగినట్లుగానే ఫ్రాంచైజీల నిర్వహణ ద్వారా మార్కెట్లో సేఫ్ గేమ్ ఆడేందుకు డిసైడైంది.

 

ఫ్రాంచైజీలను ఇవ్వడం ద్వారా 270 కంటే ఎక్కువ ఔట్‌లెట్లను బాటా ఇండియా నిర్వహిస్తోంది.రాబోయే రెండు మూడేళ్లలో కూడా కొత్తగా ఏర్పాటు చేయబోయే స్టోర్లలో 80-90శాతం ఫ్రాంచైజీ రూట్‌లోనే ప్రారంభించనుంది. ఈ మేరకు కంపెనీ ఎండి, సీఈఓ గుంజన్ షా తెలిపారు. ఈ పద్దతిలోనే ప్రస్తుతం మంచి ఆదాయం గడించవచ్చని చెప్పారాయన. బాటాపై నమ్మకం ఉన్న, మంచి ఆంట్రప్రెన్యూర్లకు స్వాగతం పలుకుతున్నట్లు కోల్‌కతా రిటైల్ సమిట్‌లో ప్రసంగించారు

 

గ్రామీణ ప్రాంతాలు ఇప్పుడు చాలా వేగంగా మారుతున్నట్లు దాన్ని అందిపుచ్చుకోవాలంటే, రిటైల్ స్టోర్లను డైరక్ట్ గా కంటే ఫ్రాంచైజీలను నిర్వహించినప్పుడు ఉభయతారకంగా ఉంటుందని బాటా ఇండియా నమ్ముతోంది. క్యు2లో బాటా ఇండియా 37.1 కోట్ల నికరలాభం ఆర్జించింది. ఇదే గత ఏడాది క్యు2లో రూ.44.3 కోట్ల నష్టం వాటిల్లిందీ కంపెనీకి. 

\

గత ట్రేడింగ్ సెషన్‌లో బాటా ఇండియా షేర్లు ఒక శాతం నష్టంతో రూ. 1896వద్ద ముగిశాయ్


bata india