చలో దేఖో బేటా ఏ బాటా..! అన్‌లాక్‌తో పరుగులు పెట్టిన బాటా ఇండియా షేర్లు! సింగిల్‌డే రూ.100 ప్రాఫిట్ ! ఇట్స్ ఓపెనింగ్ టైమ్..!

2021-06-10 12:08:16 By Anveshi

img

దేశవ్యాప్తంగా రాష్ట్రాలు తాళాలు తీసి గూట్లో పెడుతున్నవేళ కొన్ని కంపెనీల షేర్లకి రెక్కలొచ్చేస్తున్నాయ్. వాటిలో బాటా ఇండియా ప్రథమంగా ఉంది దాదాపు రెండు నెలలుగా మూతబడిన వ్యాపారాలతో సతమతం అయిన ఈ కంపెనీల షేర్లు, ఇప్పుడు షాపులు తిరిగి తెరుచుకుంటండటంతో..ర్యాలీ చేస్తున్నాయ్.ఇంట్రాడేలో ఇవాళ బాటా ఇండియా  షేర్లు  నిన్నటి(బుధవారం) ముగింపుతో పోల్చితే ఏకంగా  వందరూపాయలు పెరిగింది. 6శాతానికిపైగా పెరిగి రూ. 1657.50కి చేరింది ఇది బాటా ఇండియా 52 వీక్స్ హై ప్రైస్‌కి  ఇరవైరూపాయలన్నర మాత్రమే తక్కువ

 

ఆర్థికపరంగా కోవిడ్ 19 పేజ్ ఇక దాదాపుగా ముగిసినట్లే అని చాలామంది భావిస్తున్నారు. టీకాల పంపిణీ కార్యక్రమం పెద్ద సంఖ్యలో సాగుతోంది. అలానే రాబోయే మూడు నెలలకాలంలో దేశ జనాభాలో కనీసం మూడొంతుల ముందికి ఒక్క డోసు  అయినా వ్యాక్సిన్ పడే సూచనలు కన్పిస్తున్నాయ్. అందుకే ఫ్యూచర్ వ్యూ‌లో గ్రోత్ ప్రాస్పెక్టస్ బ్రహ్మాండంగా ఉంటుందని బాటా ఇండియా ఇన్వెస్టర్లు అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్లుగానే ఇవాళ్టి ర్యాలీలో అది రిఫ్లెక్ట్ అయింది. 

 


నార్త్ స్టార్, హష్ పప్పీస్, మేరీ క్లారీ, వెయిన్‌బ్రెన్నర్, నేచురలైజర్, పవర్, నార్త్ స్టార్, స్కూల్, బాటా కంపిట్, బబుల్‌గమర్స్ ఇలా రకరకాల బ్రాండ్లతో బాటా ఇండియా ఫుట్ వేర్, యాక్సెసరీస్ విక్రయిస్తుంటుంది 1600కిపైగా రిటైల్ షాప్స్ బాటా ఇండియాకి దేశవ్యాప్తంగా ఉన్నాయి. 

 

 

క్యు4లో దాదాపు 30శాతం క్షీణతతో రూ.29.4కోట్ల లాభానికి బాటా ఇండియా పరిమితమైంది. ఐతే క్యు3లో మాత్రం మంచి  అమ్మకాలు సాధించిన బాటాఇండియా రాబోయే పండగల సీజన్ కోసం సిద్ధమవుతోంది. పెంటప్ డిమాండ్, వి షేప్, కే షేప్  ఇలా ఎన్ని చెప్పుకున్నా, జనం తిరిగి బయట తిరగడానికి అలవాటుపడితే, అరిగిపోయిన, తెగిపోయిన చెప్పులను మూలన పడేస్తారనేది సత్యం. ఇది చెప్పడానికి పెద్ద రీసెర్చ్ అవసరం లేదు. ఆ క్రమంలో దేశంలో మంచి బ్రాండ్ నేమ్ ఉన్న బాటా  ఇండియా చెప్పల్, షూ వ్యాపారం చక్కగా  పుంజుకుంటుందని అంచనా. 


bata india rally q4 netprofit unlock opening time huffies bubble brand telugu footwear retail stores

Expert's View


నేను వేసుకున్న కోటు రంగు , రానున్న రోజుల్లో మార్కెట్ల రంగు ఇదేనా ?

Trending