అరబిందో ఫార్మా షేర్లకు ఇవాళ అశనిపాతం లాంటి సమాచారం చేరడంతో డౌన్ ట్రెండ్ తప్పలేదు.హైదరాబాద్‌లోని యాక్టివ్ ఫార్మాసూటికల్ ఇంగ్రేడియంట్స్ ఫెసిలిటీకి అమెరికా ఎఫ్డిఏ వార్నింగ్ లెటర్ పంపడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది.
కంపెనీ షేర్లు 5శాతానికిపైగా పతనమై రూ.684.95కి చేరగా, నవంబర్ 11న ఈ స్టాక్ 52వారాల కనిష్టాన్ని రూ.620.55 వద్ద సృష్టించింది.ఎన్ఎస్ఈ, బిఎస్ఈలో కలిపి 40లక్షలకిపైగా షేర్లు ట్రేడ్ కావడం గమనార్హం.
నవంబర్ 10నే యూఎస్ఎఫ్డిఏ ఈ యూనిట్ 1ని క్లాసిఫై చేయగా, తాజాగా వార్నింగ్ కమ్యూనికేషన్ అందుకుంది. దీనిపై తొందర్లోనే సమస్యని రిజాల్వ్ చేస్తామంటూ కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
తాజా పరిణామంతో ఈ యూనిట్‌లోని వ్యాపారంపై ఎలాంటి ప్రభావం ఉండదని అరబిందో ఫార్మా చెప్తోంది.ప్రస్తుతం అరబిందో ఫార్మా షేర్లు రూ.695 వద్ద ట్రేడ్ అయ్యాయ్