ఏ స్టాక్ టు డిఫై ది ట్రెండ్: ESG థీమ్‌లో 65శాతం రాబడికి అవకాశమున్న కంపెనీ ఇదంటోన్న నోమురా ఏజెన్సీ

2021-11-25 11:55:39 By Anveshi

img

నిఫ్టీలో దాదాపు 1500 పాయింట్ల పతనం నమోదు అయిన తర్వాత, బెస్ట్ బయింగ్ ఆప్షన్ ఏది అని చాలామంది ట్రేడర్లు వెతకడం సహజం. అలాంటి వారికి ప్రత్యేకించి, డౌన్‌ట్రెండ్ ఉందనే ప్రచారం బలంగా ఉందనే నేపథ్యంలో ఓ స్టాక్ మంచి రిటన్స్ ఇస్తుందంటూ అనలిస్టులు ఊరిస్తున్నారు. అదే వాటెక్ వాబాగ్

 

ఈ స్టాక్ ప్రస్తుత ధర నుంచి 65శాతం రిటన్స్ ఇస్తుందంటూ నోమురా రీసెర్చ్ ఏజెన్సీ అభిప్రాయ పడింది

 

ఎమర్జింగ్ ఈఎస్‌జి థీమ్‌లో( ఎన్విరాన్‌మెంట్ సోషల్ గవర్నెన్స్) వాటెక్  వాబాగ్ అద్భుతంగా పనితీరు ప్రదర్శిస్తోంది. వాటర్ ట్రీట్‌మెంట్ రంగంలో వాటెక్ పరిష్కార మార్గాలు, దేశంలోని తాగునీటి సమస్యని తీర్చడంలో పనికి వస్తాయని ఇదే వ్యాపార అవకాశానికి పెద్ద  ప్లస్ పాయింట్‌గా చెప్తున్నారు. అలానే నీటి వృథాని అరికట్టడంలోనూ వాటెక్ వాబాగ్ మంచి డిమాండ్ అందిపుచ్చుకుంటోంది.

 

నోమురా ఇండియా కంపెనీ వాటెక్ వాబాగ్‌ కంపెనీ ఆర్డర్ బుక్, ఎగ్జిక్యూషన్‌పై మంచి  ఔట్‌లుక్ ఇచ్చింది. అలానే మూలధన వ్యయం, విస్తరణ కోసం వ్యూహాలు కూడా కంపెనీ లాంగ్ రన్‌లో మంచి లాభాలను అందిస్తాయని నోమురా అభిప్రాయపడింది

 

కంపెనీ ఆర్డర్ల బుక్ వేల్యూ రూ.10వేలు కోట్లుగా ఉన్నట్లు స్వయంగా యాజమాన్యమే ఇన్వెస్టర్ల ప్రజెంటేషన్లలో తెలిపింది. గత త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ రెవెన్యూ  12శాతం,ఎబిటా  1శాతం వృద్ధి సాధించింది వాటెక్ వాబాగ్. ఆపరేటింగ్ మార్జిన్లు కూడా Q2లో మెరుగుపడ్డాయి.

 

ప్రస్తుతం వాటెక్ వాబాగ్ షేర్ల ధర రూ.359 వద్ద ట్రేడ్ అయ్యాయ్


vatech wabag esg water treatment

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending