అమీ తుమీ తేల్చేసిన స్పెషాల్టీ కెమికల్స్..! 50% ప్రీమియంతో లిస్టింగ్..! ఇంట్రాడేలో రూ.310 లాభం

2021-09-14 10:18:46 By Anveshi

img

స్పెషాల్టీ కెమికల్స్ రంగంలో వ్యాపారం చేస్తూ..ఈ రోజు లిస్టైన అమీ అర్గానిక్స్ లిస్టింగ్ గెయిన్స్ దద్దరిల్లాయ్ ఓపెనింగ్‌లోనే దాదాపు 50శాతం లాభం పంచి రూ.903 దగ్గర లిస్ట్ అయ్యాయ్. ఆ తర్వాత ఇంట్రాడేలో రూ.929.60వరకూ పెరిగాయ్. 

 

ఇష్యూ ప్రైస్ రూ.610 కాగా, అమీ అర్గానిక్స్ రూ.929.60 వరకూ పెరగడంతో ఓపెనింగ్ రోజున రూ.310 లాభం పంచినట్లైంది. ప్రస్తుతం ఈ షేర్లు రూ.902-910 మధ్య ట్రేడవుతున్నాయ్

 

సూరత్ బేస్డ్ కెమికల్ కంపెనీ అయిన అమి ఆర్గానిక్స్ ఐపిఓ ద్వారా రూ.570 కోట్ల ధనం  సమీకరించింది. ఇందులో ప్రెష్ ఇష్యూ 200కోట్లు కాగా, మిగిలినది ఉన్న ప్రమోటర్ల వాటాలు విక్రయించుకోవడానికి ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ఐపిఓని  పూర్తి చేసారు.

 

ఈ కంపెనీకి సంబంధించి ఐపిఓకి ముందే 20మంది యాంకర్ ఇన్వెస్టర్లు( కంపెనీలు) రూ.171కోట్లతో 28,01,485షేర్లను కొనుగోలు చేయడం. ఈ యాంకర్ ఇన్వెస్టర్లే, స్టాక్  మార్కెట్లలో షేరు లిస్టైన తర్వాత మొదటి నెల రోజుల తర్వాత కీలకం అవుతున్న తరుణంలో..ఆ సెగ్మెంట్ నుంచి మంచి ఆదరణ రాబట్టడం ప్రాథాన్యత సంతరించుకుంది

 

ఈ  ఏడాదితో పోల్చితే,  14.82 అడ్జస్టెడ్ ఈపిఎస్ కలిగిన అమీ అర్గానిక్స్,  కంపెనీ షేర్లు 41.6 పీఈతో లిస్ట్ కాబోతున్నాయ్. అలా మొత్తం రూ.2222.7కోట్ల మార్కెట్ కేపిటలైజేషన్ సాధించనుంది. ఇదే ఆర్తి ఇండస్ట్రీస్   54.20 , హికాల్ ,46.13 P/E సాధించి ఉన్నాయ్

 


AMI ORGANICS IPO.FULLY SUBSCRIBED bumper profit

Expert's View


అవకాశం ఇచ్చిన tv5 నాయుడు గారికి | ఆదరిస్తున్న మీకు నా ధన్యవాదాలు

Trending