అంబానీకి అదానీ మరో ఛాలెంజ్
న్యూస్ ఈజ్ పవర్
డేటా పవర్‌పై కన్నేసిన కుబేరులు
డేటా సెంటర్లతో డిజిటల్ ఇండియా వ్యాపారంలో మేజర్ షేర్ కోసం పోటీ
డేటా..డేటా..ప్రపంచంలో ఇప్పుడు ఏ వ్యాపారానికైనా ఇదే ముఖ్యం. డేటా గుప్పెట్లో ఉంటే చాలు సామ్రాజ్యాలనే తలకిందులు చేస్తామనే హ్యాకర్లు ఉన్నారు. ఇదే డేటా పవర్ ఇంత కీలకమైన డేటా రంగంలో భారతీయుల పాత్ర ప్రముఖంగా మారబోతోందా అంటే..వరసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు దాన్నే సూచిస్తున్నాయ్. ఇప్పటికే ముఖేష్ అంబానీ తన డేటా మంత్రంతో ప్రపంచంలోనే టాప్ 10 మొబైల్ ఆపరేటర్‌గా అవతరించగా..మరో కుబేరుడూ ఆ రంగంపై కన్నేశారు.
భారత కుబేరుల్లో ఒకరిగా..న్యూఎరా బిజినెస్ జైయింట్గా దూసుకుపోతోన్న అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ఇప్పుడు మరో సవాల్ విసిరారు. రిలయన్స్ ఆయిల్ టూ కెమికల్స్ వ్యాపారం విడి సంస్థగా విస్తరిస్తున్నట్లు ప్రకటించిన రోజే, తానూ డేటా సెంటర్ బిజినెస్‌లోకి ఎంట్రీ కన్ఫామ్ చేశాడు. ఇందుకోసం ఎడ్జ్కన్నెక్స్ సంస్థతో కలిసి 50:50 వాటాతో అదానీ కనెక్స్ జాయింట్ వెంచర్‌ని అనౌన్స్ చేసింది అదానీ సంస్థ. గ్లోబల్ డేటా సెంటర్ ఆపరేటర్ అయిన ఎడ్జ్కన్నెక్స్తో కలిసి భారతదేశం అంతటా డేటా సెంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు వాటిని నిర్వహించడంలో కాలు పెట్టారు. ప్రస్తుతానికి ఈ రెండు సంస్థలఅనుభవాలను తమకి మాత్రమే వినియోగించుకునేందుకు తద్వారా వ్యాపార విస్తరణ చేసుకునేందుకే అని చెప్తున్నారు కానీ..ఫ్యూచర్లో ఈ డేటా సెంటర్లు ఇతర సంస్థలకు కూడా సేవలు అందించే అవకాశాలున్నాయ్.
ఫుల్ స్కేల్ డేటా సెంటర్లకు అదనంగా..అదానీ కనెక్స్ పోర్ట్‌ఫోలియో ఎడ్జ్ డేటా సెంటర్లను కూడా నెలకొల్పబోతోంది. ప్రాంతీయంగా, భారీ స్థాయిలో డేటా సెంటర్ల రూపకల్పన, అది కూడా రెన్యువబుల్ ఎనర్జీ( సౌర, జల విద్యుచ్ఛక్తితో నడిచే)తో నడిచేలా రూపొందించబోతున్నారు. ఎడ్జ్ కనెక్స్ సీఈఓ మాట్లాడుతూ, అదానీ సంస్థతో భాగస్వామ్యం తమకి భారత్‌లో సరైన పార్ట్నర్ లభించినట్లుగా ఉందన్నారు. దేశంలోని అదానీ, ఎడ్జ్ కనెక్స్ కస్టమర్లకు తమ అనుభవాన్ని పంచడంలో, డిజిటల్ మౌలిక వసతుల కల్పనలో జాయింట్ వెంచర్ చక్కగా ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా భారత డిజిటల్ ఎకానమీలో ఇన్వెస్ట్ చేయడంపై కూడా తమ ఫోకస్ పెట్టినట్లు చెప్పారు. ఇదే కీలకం కాబోతోంది. ఎందుకంటే రిలయన్స్ సంస్థతో కలిసి అమెజాన్, ఫేస్బుక్, సిల్వర్ ఓక్, ఇలా బోలెడు సంస్థలు కూడా ఇదే రకమైన డిజిటల్ ఇండియా అనే కాన్సెప్ట్‌ని ప్రకటించారు. అంటే ఆ రకంగా, గౌతమ్ అదానీ ముఖేష్ అంబానికి సవాల్ విసురుతున్నట్లే భావించాలి. తన ఫ్లాగ్షిప్ కంపెనీలైన అదానీ పోర్ట్స్, అదానీ పవర్ సంస్థలకుఆయా రంగంలో నిర్వహణ పరంగా మేలు కలగడం ఒకటి..తర్వాత డిజిటల్ మౌలిక వసతుల రంగంలో తనదైన ముద్ర వేసేందుకు ఎడ్జ్‌కనెక్స్ జాయింట్ వెంచర్ ఉపయోగపడుతుందనే అంచనా ఉంది.
ఈ 50:50 జాయింట్ వెంచర్‌తో అదానీ ఎనర్జీ మేనేజ్మెంట్, రెన్యువబుల్ పవర్, రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారం,నిర్వహణ సులువు కాబోతోంది. అది కూడా దేశవ్యాప్తంగా డేటా సెంటర్లు నెలకొల్పడమనే ఐడియా మాస్టర్ స్ట్రోక్‌గా చూడాలి. చెన్నై, నవీ ముంబై, నోయిడా, వైజాగ్, హైదరాబాద్ ఐదు నగరాల్లో డేటా సెంటర్లు ఓపెన్ కాబోతున్నాయ్. ఇప్పటికే ఈ ఐదు ప్రాంతాల్లో నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయని చెప్పడం హైలైట్. ప్రపంచంలోనే వినియోగదారుల పరంగా ఐదో అతి పెద్ద డేటా సబ్స్ర్రైబర్ల దేశం భారత్. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇలా రకరకాల విభాగాల్లో దేశంలో డిజిటల్ ఇన్‌ఫ్రాకి బాగా వ్యాపార అవకాశం ఉంది. అందుకే అదానీ ఈ రంగంలో చడీ చప్పుడూ లేకుండా సైలెంట్‌గా ఎంట్రీ ఇచ్చేశాడంటున్నారు
అదానీ గ్రూప్ షేర్లు
అదానీ గ్రీన్ ఎనర్జీ రూ.1193.85 ( 4.95శాతం జంప్)
అదానీ పోర్ట్స్ రూ.667.40(1శాతం జంప్)
అదానీ ఎంటప్రైజెస్ రూ.808.60( 0.33శాతం జంప్)
అదానీ పవర్ రూ.56 (0.90శాతం జంప్)
అదానీ టోటల్ గ్యాస్ రూ.488.30(-1.90శాతం డౌన్)
రిలయన్స్ షేర్ల జోరు
రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.2036.20( 1.40శాతం జంప్)
రిలయన్స్ ఇన్ఫ్రా రూ.32.30 ( 2.11శాతం జంప్)