డిమాండ్ పెరిగినట్లేనా...? ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిజల్ట్స్ సిగ్నల్స్ అందుకున్నారా..? Q4లో రూ.32కోట్ల టర్న్అరౌండ్ లాభం

2022-05-18 17:50:03 By Anveshi

img

దేశంలో ఈకామర్స్, ప్రత్యేకించి ఫ్యాషన్ రిటైల్ సంస్థల ఆర్థిక ఫలితాలు, ఓ ప్రత్యేకమైన పరిస్థితికి అద్దం పడుతున్నాయ్.ద్రవ్యోల్బణం బాగా పెరిగిపోయి, జనం ఉత్పత్తులను కొనలేక సగం సగం కొనుగోలు చేస్తుంటే, ఈ కంపెనీల అమ్మకాలు మాత్రం అదే స్థాయిలో పెరుగుతున్నాయ్. 

 

బుధవారం తన నాలుగో త్రైమాసికపు ఆర్ధిక ఫలితాలను వెల్లడిస్తూ, " అన్ని విభాగాల్లో వృద్ధి నమోదు కావడంతో మంచిలాభం గడించాం. ఈకామర్స్‌తో ఇతర విభాగాల్లో పెట్టుబడి పెట్టినందుకు వాటి ఫలితాలు కూడా చక్కగా వచ్చాయని  "ఆదిత్యబిర్లా ఫ్యాషన్ రిటైల్ ప్రకటించింది. 

 

ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ క్యు4లో రూ.2282.83 కోట్ల ఆదాయం గడించింది. ఇది గత ఏడాది క్యు4తో పోల్చితే 25.32శాతం వృద్ధి. ఇదే లాభమైతే రూ.31.90 కోట్లు. గత ఏడాది క్యు4లో రూ.195.86కోట్ల నష్టాన్ని కంపెనీ మూటగట్టుకోవాల్సి వచ్చింది. 

 

గడచిన 2022 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఖర్చులు రూ.2266కోట్లకిపై మాటే కాగా, మదుర లైఫ్ స్టైల్ విభాగం నుంచి రూ.1660కోట్ల ఆదాయం ఆర్జించింది. పాంటలూన్స్ విభాగం నుంచి 674.86 కోట్లు గడించగా, ఇదే ఈకామర్స్ నుంచి ఆదాయం 81శాతం వృద్ధి నమోదు అయిందని కంపెనీ ప్రకటించింది. 

 

మొత్తంగా ఏడాదికి కంపెనీ తన నష్టాలను రూ.118.36కోట్లకి తగ్గించుకుంది. గత 2021 సంవత్సరంలో ఈ నష్టాలు రూ.736 కోట్లుగా ఉన్నాయ్.

 

ఇవాళ్టి ట్రేడింగ్‌లో ఆదిత్యబిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ షేర్లు ఫ్లాట్‌గా రూ.280.60 వద్ద ముగిశాయ్