ఈ 7 స్టాక్స్‌తో ఓ బ్యాలెన్స్‌డ్ పోర్ట్‌ఫోలియో రెడీ ! ప్రాఫిట్ యువర్ ట్రేడ్ ఫెస్టివల్ రికమండేషన్స్

2021-10-14 20:46:14 By Anveshi

img


స్టాక్ మార్కెట్లలో మంచి స్టాక్స్ కోసం ఇన్వెస్టర్లు, ట్రేడర్ల అన్వేషణ ఒక్క రోజు, వారం, నెల, ఏడాదిలో ముగిసేదే కాదు. అందుకే దేశవ్యాప్తంగా ఉన్న అనలిస్టులు ప్రతి రోజూ కొన్ని వందల స్టాక్స్ పై తమ రీసెర్చ్ కొనసాగిస్తూనే ఉంటారు.  అందులో భాగంగానే ప్రాఫిట్ యువర్ ట్రేడ్ అనలిస్టులు కానీ, టివి5 బిజినెస్ హెడ్ వసంత్ కుమార్ కానీ ప్రతి రోజూ తమ సూచనలు ఇవ్వడం తెలిసే ఉంటుంది. ఇప్పుడు పండగ కానుకగా ఉదయం 7 స్టాక్స్‌ని అనలిస్టులు రికమండ్ చేసారు. ఆ వీడియోలోని ఎక్సర్ప్ట్స్ ( క్రోడీకరించిన, ముఖ్యమైన అంశాలను చదవండి..పనిలో పనిగా కింది టేబుల్‌లో ఆ స్టాక్ రికమండేషన్స్‌పై ఫోకస్ పెట్టండి


వాటిలో ఐటిసి, కరూర్ వైశ్యా బ్యాంకులను కుటుంబరావ్ రికమండ్ చేయగా, ఈ ఏడాదిలోనే కరూర్ వైశ్యా బ్యాంక్ ఆశ్యర్యకరమైన లాభాన్ని అందిస్తుందని చెప్పారాయన. అంతేకాదు ఐటీసి ఈ ఏడాదిలోనే లీడర్‌గా మారుతుందని, తన వ్యక్తిగత అభిప్రాయం అయితే ఈ స్టాక్ రూ.325-350 వరకూ వెళ్లగలదని చెప్పారు. 


వెల్త్ మిల్స్ సంస్థకి చెందిన క్రాంతి బత్తిన గారి రికమండేషన్స్ చూస్తే, వోకార్డ్ ఫార్మాని, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ స్టాక్స్‌ను కొనుగోలు చేయాలని సూచించారు. ఈ రెండు స్టాక్స్‌లో ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ఎంత లగార్డ్‌గా ఉన్నా, ఏడాదిలో 14శాతం డివిడెండ్ రూపంలో స్టాక్ హోల్డర్లకు రిటన్ ఇచ్చినట్లు తెలిపారు. అలానే ఫార్మా స్పేస్‌లో కూడా వోకార్డ్ ఫార్మా రాబోయే రోజుల్లో మంచి రిటన్స్ ఇస్తుందన్నారు

 

ఈక్విడస్ రాజేంద్రగారు దీపక్ ఫర్టిలైజర్స్ స్టాక్‌ని రికమండ్ చేస్తూ..ఇప్పుడున్న ధర నుంచి కూడా దీపక్ ఫర్టిలైజర్స్ రాబోయే ఏడాదికాలంలో 30శాతం రిటన్ ఇస్తుందని చెప్పారు.

 

చివరిగా వసంత్ గారు తమ ఫేవెరెట్ స్టాక్ ఎంఫసిస్‌నే కొనుగోలు చేయాలని సూచిస్తూ, లార్జ్ క్యాప్ రిలయన్స్‌ని బయ్ చేయాలంటూ రికమండ్ చేస్తూ దసరా శుభాకాంక్షలతో ముగించారు

 

కింది టేబుల్‌లో స్టాక్ రికమండేషన్స్ ఇవాళ్టి పెర్ఫామెన్స్ చూడండి

రికమండెడ్ బై

 స్టాక్

రికమండేషన్ ఇచ్చినప్పటి ధర

గురువారం నాటి క్లోజింగ్

టార్గెట్ ధర /  కామెంట్స్

వసంత్ కుమార్

రిలయన్స్, ఎంఫసిస్

రూ.2694.95, రూ.3130.30

రూ.2700.40, రూ.3266.60

 మంచి రిటన్స్

కుటుంబరావు

ఐటీసి, కరూర్ వైశ్యా బ్యాంక్

రూ.256.65, రూ.49.30

రూ.261.85*  రూ.49.25

రూ.325-350  కేవిబీ సర్‌ప్రైజింగ్ పెర్ఫామెన్స్ చూడవచ్చు

క్రాంతి

వోకార్డ్, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్

రూ.482.20, రూ.131.25

రూ.490.50  రూ.134.40

 

రాజేంద్ర

దీపక్ ఫర్టిలైజర్స్

రూ.414.55

రూ.421

30% అప్‌సైడ్

 


deepak rajendra vasanth kutumbarao kranthi recommendations free analyst

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending