ఒక్క ఏడాదిలో లాక్షా20వేల ఉద్యోగాలు..పొలిటికల్ స్లోగన్ కాదు..4 ఐటీ కంపెనీల జోరిది..!

2021-10-15 11:50:59 By Anveshi

img

2022 ఆర్థిక సంవత్సరం  రెండో త్రైమాసికంలో ఐటీ కంపెనీలు పోటాపోటీగా ఫలితాలు ప్రకటిస్తున్నాయ్. ఇందులో ముందుగా టిసిఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సిఎల్ అనౌన్స్ చేసిన రిజల్ట్స్ ఓవరాల్‌గా మార్కెట్లను మెప్పించాయ్ అంతేకాదు. రాబోయే ఏడాదికాలంలో మొత్తంగా లక్షా20వేలమందిని తమ సంస్థలలోకి తీసుకోబోతున్నట్లు ప్రకటించాయ్


ఐటీ కంపెనీల్లోకి ఇంత పెద్ద ఎత్తున ప్రెషర్లను రిక్రూట్ చేసుకోనుండటం, ఈ రంగంలోని జోరుకు నిదర్శనం


ఈ నాలుగు కంపెనీలే మొత్తం ఐటి వర్క్ ఫోర్స్‌లో నాలుగోవంతుకి సమానం. ఐటీ ఇండస్ట్రీలో 46లక్షలమంది పని చేస్తున్నట్లు ఓ అంచనా. ఈ ఏడాదిలో లక్షా2వేలమందికి పైగా కొత్తవారిని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఉద్యోగులుగా తీసుకోగా, ఏడాది చివరకు ఈ సంఖ్య లక్షా60వేలకి చేరనట్లు అంచనా

 

విదేశాల్లో పెద్ద పెద్ద కంపెనీలతో మన ఐటీ సంస్థలు డీల్స్ కుదుర్చుకోవడంతో పాటు, మున్నెన్నడూ లేని రీతిలో క్లయింట్ల సంఖ్య పెంచుకుంటున్నాయ్. ఈ క్రమంలో ఉద్యోగులు కూడా ఇతర సంస్థలకు వలస పోతుండటంతో ఈ ప్రెషర్ల పాత్ర కీలకం అందుకే వీలైనంతగా ప్రెషర్ల సంఖ్య పెంచుకుంటున్నారనేది ఇండస్ట్రీ నిపుణుల అంచనా

 

ఒక్క టిసిఎస్ కంపెనీనే 78వేలమందిని కొత్తగా ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నట్లు చెప్పింది. ఇన్ఫోసిస్ 45వేలమందిని, విప్రో 17వేలమందిని రిక్రూట్ చేసుకుంటుండగా, మైండ్ ట్రీ, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ కూడా భారీగానే కొత్తవారికి ఉపాధి కల్పించబోతున్నాయ్. దీంతో  ఒక్కసారిగా మళ్లీ సాఫ్ట్వేర్ ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుందనడంలో  సందేహం లేదు
 


it inty tcs hcl tech mindtree wipor

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending