3 హాట్ స్టాక్స్ -3వారాల కోసం ట్రేడింగ్ ఐడియాస్

2021-03-02 08:45:23 By Anveshi

img


భారీగా బౌన్స్ బ్యాంక్  అయిన నిఫ్టీకి వీక్లీ చార్టులపై 14300-14350 దగ్గర మంచి సపోర్ట్ కన్పిస్తోంది. అలానే మార్చి నెలకి సంబంధించి
కన్జర్వేటివ్ అప్రోచ్ తీసుకోవడం మంచిది. ప్రతి బౌన్స్‌ని కూడా దీర్ఘకాలిక వ్యూహాలకు వినియోగించుకోవాలి. నిఫ్టీ రెసిస్టెన్స్ 14900-15,180 పాయింట్ల దగ్గర కన్పిస్తోంది

కొనండి-దాల్మియా భారత్ -ఎల్‌టిపి రూ.165, టార్గెట్ రూ.188, స్టాప్‌లాస్ రూ.152, అప్‌సైడ్-14%

దాల్మియా భారత్ స్టాక్ వీక్లీ ఛార్టులలో అప్‌వార్డ్ స్లోపింగ్ ఛానల్ నుంచి బ్రేకవుట్ నమోదు చేసింది. గత వారాలతో పోల్చితే వాల్యూమ్స్ కూడా ఎక్కువగా నమోదు అవుతున్నాయ్. ప్రాథమిక ట్రెండ్ ప్రకారం దాల్మియా భారత్ బుల్లిష్‌గా కన్పిస్తోంది.  వీక్లీ, డైలీ ఛార్టులపై  హయ్యర్ టాప్స్, హయ్యర్ బాటమ్స్‌ను నమోదు చేస్తోంది.అన్ని మూవింగ్ యావరేజ్‌లపైనే స్టాక్ ట్రేడవుతోంది

కొనండి- టొరెంట్ పవర్ ఎల్‌టిపి రూ.387.55, టార్గెట్ రూ.415, స్టాప్‌లాస్ రూ.360, ప్రాఫిట్-7%

ఫిబ్రవరి నెలలో టొరంట్ పవర్ ఆల్ టైమ్ హై మార్క్‌ని దాటింది. అది కూడా ఎన్నో నెలల కన్సాలిడేషన్‌కి ముగింపు పలికి మరీ ఈ స్థాయి దాటింది. 
బ్రేక్ అవుట్ తరుణంలో మంచి వాల్యూమ్స్ నమోదు చేసింది. హయ్యర్ టాప్స్, హయ్యర్ బాటమ్స్ నమోదు చేస్తోన్న ఈ స్టాక్ ఆర్ఎస్ఐ, ఎంఎసిడి, డిఎంఐ అన్ని ఇండికేటర్లు కూడా బుల్లిష్‌గా సూచిస్తున్నాయ్. అన్ని మూవింగ్ యావరేజ్‌ రేట్లను అధిగమించి ప్రస్తుతం స్టాక్ ట్రేడవుతోంది. 
 

కొనండి -ఎన్ఎండిసి ఎల్‌టిపి రూ.131.65, టార్గెట్-రూ.147, స్టాప్‌లాస్, రూ.120, అ‌ప్‌సైడ్ -12%

ఎన్ఎండిసి స్టాక్ గత నిరోధ స్థాయిలను డైలీ ఛార్టులలో అధిగమించింది. అలానే రౌండింగ్ బాటమ్‌ ప్యాటెర్న్ నమోదు అయిన ఎన్ఎండిసి స్టాక్ ఇండికేటర్లు ఆర్ఎస్ఐ,ఎంఏసిడి, డిఎంఐ అన్నీ షార్ట్‌టర్మ్‌లో మంచి ర్యాలీకి సంకేతాలుగా నిలుస్తున్నాయ్ 


( పై రికమండేషన్స్, వినయ్ రంజని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్‌వి..profityourtrade.inకి సంబంధం లేదు)

Expert's View


WHAT IS BITCOIN ? HOW TO INVEST IN CRYPTO CURRENCY ?

Trending