స్మాల్ క్యాప్ సెలెక్ట్..
డియర్ సబ్‌స్క్రయిబర్స్, సెన్సెక్స్, నిఫ్టీలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిని తాకుతూ ఇన్వెస్టర్లకు లాభాల పంట పండిస్తున్న సమయం ఇది. మరోవైపు స్మాల్‌క్యాప్ ఇండెక్స్ మార్చి 2020 కనిష్ట స్థాయి నుంచి 80శాతం వృద్ధి సాధించి రిటైల్ ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది.
రిటైల్ ఇన్వెస్టర్లకు స్మాల్‌క్యాప్ స్టాక్స్ అంటే ఎప్పటికీ తనివి తీరని అమితమైన మోజు. అయితే ఈ స్టాక్స్‌లో రిటర్న్స్ ఎంత అధికమో రిస్క్‌కు అంతకంటే ఎక్కువ అవకాశమే ఉంటుంది. అందుకే స్మాల్‌క్యాప్ స్టాక్స్‌ను కొనుగోలు చేసిన తరువాత ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడం అవసరం. సరైన స్టాక్‌ను ఎంచుకోగలిగితే స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లో రిటైల్ ఇన్వెస్టర్లకు మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అందడం ఖాయం.
పదేళ్ళ క్రితం సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్ షేర్ ధరలతో ఇన్వెస్టర్లను నిరాశపర్చిన అనేక స్టాక్స్, ఇప్పుడు వంద రెట్లు, వేయిరెట్ల వృద్ధితో మల్టీ బ్యాగర్స్‌గా నిలవడం మనందరం గమనిస్తున్న జీవిత సత్యం. క్యాప్లిన్ పాయింట్ ల్యాబ్ వంటి స్టాక్ గత పదేళ్ళలో రూ.4 నుంచి రూ.490కి, అవంతి ఫీడ్స్ రూ.3 స్థాయి నుంచి రూ.513కి, ఆర్కైల్ అమైన్స్ రూ.45 నుంచి రూ.3700 స్థాయికి, బజాజ్ ఫైనాన్స్ రూ.80 నుంచి రూ.4820 స్థాయికీ చేరాయి మన కళ్ళ ముందరే.
వాస్తవానికి ప్రస్తుతం లార్జ్‌క్యాప్ స్టాక్స్‌గా మనం చూస్తున్న షేర్లలో అత్యధికం ఒకప్పుడు స్మాల్‌క్యాప్ కోవకు చెందినవే. అందుకే ప్రతి ఒక్కరి పోర్ట్‌ఫోలియోలో కనీసం 20శాతం స్థానం స్మాల్‌క్యాప్ స్టాక్స్‌కి ఇచ్చి తీరాల్సిందే. రానున్న రెండు, మూడేళ్ళ మార్కెట్ ప్రయాణంలో స్మాల్‌క్యాప్ స్టాక్స్ నుంచి రెట్టింపు రిటర్న్స్ అందే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి. ఈ క్యాలెండర్ సంవత్సరంలోనే రామ్‌కో సిస్టమ్స్ (165 శాతం రిటర్న్), సోలారా యాక్టివ్ ఫార్మా (157 శాతం), బాలాజీ అమైన్స్ (155 శాతం), సీక్వెంట్ సైంటిఫిక్ (120 శాతం), ఇండియా సిమ ెంట్స్ (117 శాతం) వంటి స్టాక్స్‌ను టీవీ5 ప్రాఫిట్ యువర్ ట్రేడ్ టీమ్ రికమండ్ చేసిన సంగతి తెలిసిందే. స్మాల్‌క్యాప్ స్టాక్స్ పట్ల ఇన్వెస్టర్లలో పెరుగుతున్న మోజును దృష్టిలో ఉంచుకుని ప్రాఫిట్ యువర్ ట్రేడ్ ఇప్పుడు స్మాల్‌క్యాప్ సెలెక్ట్ సర్వీసును అందిస్తోంది.
ఈ సరికొత్త సర్వీస్‌లో సబ్స్క్రయిబర్లకు ప్రతి శుక్రవారం PYT ఎనలిస్ట్ టీమ్ ఒకటి లేదా రెండు స్మాల్, మైక్రోక్యాప్ స్టాక్స్‌ను రికమెండ్ చేస్తుంది. స్మాల్, మైక్రో క్యాప్ స్టాక్స్‌లో ఒడిదుడుకులు హెచ్చుగా ఉంటాయి కాబట్టి ప్రతి 3 నెలలకి ఒకసారి ఈ స్టాక్ రికమండేషన్స్‌ను PYT ఎనలిస్ట్ టీమ్ సమీక్షించి అలర్ట్స్ అందిస్తుంది. తదనుగుణంగా ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. నెలకి కనీసం 4 స్టాక్ రికమెండేన్స్ అందుతాయి కాబట్టి, ఏ ఒక్క స్టాక్కీ మీ పోర్ట్‌ఫోలియోలో 5 శాతం కంటే ఎక్కువ భాగం లేకుండా చూసుకోవడం మంచిది.