PORTFOLIO REVIEW

Portfolio Review Service

ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సబ్‌స్క్రైబర్స్‌కు... సరికొత్త సర్వీస్‌తో స్వాగతం పలుకుతున్నాం. ప్రస్తుతం టెక్నికల్, ఫండమెంటల్ విభాగాలలో పలు ప్యాకేజ్‌లను మీకు అందిస్తున్నాం.

మా ఫండమెంటల్ రీసెర్చ్, స్మాల్‌క్యాప్ సెలెక్ట్ ప్యాకేజ్‌ల ద్వారా ఇన్వెస్టర్లు చక్కని లాభాలను గడించారని ఆశిస్తున్నాం. అయితే, ప్రాఫిట్ యువర్ ట్రేడ్‌లో మేము అందించే రికమెండేషన్స్, వాటితో పాటు టీవీ5లో దిగ్గజ ఎనలిస్ట్‌లు అందించే రికమెండేషన్స్, ఓపెన్ సోర్స్‌లో లభించే సిఫార్సులు... ఇవన్నీ కలిపి లెక్కకు మించిన రికమెండేషన్స్‌ను అందుకున్నవారు.. ఆ తర్వాత పోర్ట్‌ఫోలియో నిర్వహణ విషయంలో ఇబ్బందులు పడుతున్నారు.

అందుకే.. పోర్ట్‌ఫోలియో రీసర్చ్ సర్వీస్ అందించాలని నిర్ణయించాం.

ఎప్పటి మాదిరిగానే ఈ సర్వీస్‌కు కూడా నామమాత్రపు రుసుమును మాత్రమే నిర్ణయిస్తున్నాం.

ఇప్పటివరకూ ఆయా వ్యక్తుల ఇన్వెస్ట్‌మెంట్ మొత్తంతో సంబంధం లేకుండా.. ఒకే తరహా ఫీజును అందరికీ విధించగా... ఆయా వ్యక్తుల పోర్ట్‌ఫోలియోలను రివ్యూ చేయడంలో.. ఎనలిస్ట్‌లు వెచ్చించాల్సిన సమయం, శ్రమలను పరిగణించి... ఆయా స్టాక్స్ సంఖ్యకు అనుగుణంగా ఈ సర్వీసులో ఫీజు నిర్ణయించాము.

మన ప్రాఫిట్‌ యువర్ ట్రేడ్ వెబ్‌సైట్‌కు వెన్నెముకగా నిలుస్తున్న శ్రీ కుటుంబరావు గారు, శ్రీ రాజేంద్ర గారు మీ పోర్ట్‌ఫోలియోలను రివ్యూ చేసి తగిన సూచనలు అందిస్తారు. లాంఛింగ్ ఆఫర్‌గా ఆగస్ట్ నెల చివరి వరకూ ఈ పీజులో రాయితీ కూడా అందిస్తున్నాం.

ప్యాకేజ్ వివరాలు
-- ఈ ప్యాకేజ్‌ను తీసుకునేవారు ఒక ఏడాది సర్వీసును పొందాల్సి ఉంటుంది.
-- ఒక సంవత్సర కాలంలో 4 సార్లు రివ్యూ చేయించుకోవచ్చు.
-- మీ పోర్ట్‌ఫోలియోను XL షీట్ రూపంలో పూర్తి వివరాలతో మాకు పంపాల్సి ఉంటుంది. (స్టాక్ పేరు, ఎన్ని షేర్లు, కొనుగోలు ధర, ఎంతకాలం నుంచి హోల్డ్ చేస్తున్నారు వంటి వివరాలతో)
-- మన దిగ్గ ఎనలిస్టులలో ఎవరైనా మీ పోర్ట్‌ఫోలియోను రివ్యూ చేసి.. తగిన సూచనలు అందిస్తారు.
-- ADD, HOLD, EXIT వంటి సూచలనతో పాటు ఆ స్టాక్ పై వారి వ్యూ కూడా మీకు తెలియజేసే అవకాశం ఉంటుంది.


పోర్ట్‌ఫోలియో రివ్యూ సర్వీసుకు ఫీజు వివరాలు
20 స్టాక్స్ వరకు - ఫీజు రూ. 4000 (ప్రారంభ ఆఫర్ - రూ. 3000)
21-40 స్టాక్స్ వరకు - ఫీజు రూ. 5000 (ప్రారంభ ఆఫర్ - రూ. 4000)
41-60 స్టాక్స్ వరకు - ఫీజు రూ. 6000 (ప్రారంభ ఆఫర్ - రూ. 5000)