SBI న్యూ ఫండ్ ఆఫర్.. ఇన్వెస్ట్ చేయవచ్చా

2021-01-22 09:45:06 By Y Kalyani

img

SBI న్యూ ఫండ్ ఆఫర్.. ఇన్వెస్ట్ చేయవచ్చా

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBIన్యూ ఫండ్ ఆఫర్ ప్రకటించింది. ఎస్‌బీఐ రిటైర్మెంట్ బెనిఫిట్ ఫండ్ పేరుతో ఆఫర్ ఓపెన్ చేసింది. 2021 ఫిబ్రవరి 3 వరకు అవకాశం ఉంది. ఈక్విటీ, డెట్, గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తుంది. 5 ఏళ్లు లేదా రిటైర్మెంట్ వరకు లాక్ ఇన్ పీరియడ్ గా చూపించారు. ఇందులో నాలుగు ప్లాన్స్ ఉంటాయి. అగ్రెసివ్, అగ్రెసివ్ హైబ్రిడ్, కన్జర్వేటీవ్ హైబ్రిడ్, కన్జర్వేటీవ్ పేర్లతో ఈ ప్లాన్స్ఉన్నాయి. రిస్కును బట్టి ఏదైనా ఓ ప్లాన్ ఎంచుకోవాలి.
 
1. అగ్రెసివ్ ప్లాన్- 80 నుంచి 100 శాతం ఈక్విటీలో పెట్టుబడులు ఉంటాయి.
2. అగ్రెసివ్ హైబ్రిడ్ ప్లాన్- 65 నుంచి 80 శాతం ఈక్విటీలో పెట్టుబడులు 
3. కన్జర్వేటీవ్ హైబ్రిడ్ ప్లాన్- 60 నుంచి 90 శాతం డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో పెట్టుబడులు 
4. కన్జర్వేటీవ్ ప్లాన్- 80 నుంచి 100 శాతం డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో పెట్టుబడులు
ఈ నాలుగు ప్లాన్స్‌లో ఏది ఎంచుకున్నా 20 శాతం వరకు గోల్డ్ ఈటీఎఫ్, 10 శాతం వరకు REITs/InVITsలో పెడతారు. ఫారిన్ సెక్యూరిటీస్, ఓవర్‌సీస్ ఈటీఎఫ్స్‌లో కూడా పెట్టొచ్చు. లాక్ ఇన్ పీరియడ్‌లో ఈ నాలుగు ప్లాన్స్‌లో ఎప్పుడైనా ఇంటర్ ఛేంజ్ అవకాశం ఉంది. మొదటిసారి కనీసం రూ.5,000 ఇన్వెస్ట్ చేయాలి. సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫెసిలిటీ కూడా ఉంది. రోజూ, వారానికి ఓసారి, నెలకోసారి, మూడు నెలలకోసారి, ఆరు నెలలకోసారి, ఏడాదికోసారి ఇన్వెస్ట్ చేయొచ్చు. 
18 ఏళ్ల నుంచి 52 ఏళ్ల వయస్సులోపు ఉన్నవారు ఎవరైనా ఎస్‌బీఐ రిటైర్మెంట్ బెనిఫిట్ ఫండ్‌లో చేరొచ్చు. కనీసం నెలకు రూ.1000 ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే లైఫ్ ఇన్స్యూరెన్స్ కవర్ కూడా ఉంటుంది.
 


mutualfund sbi offers

Expert's View


ఏ దేశ ద్రవ్యోల్బణం చూసినా ఏముంది గర్వకారణం ?

Trending