క్లోజింగ్‌ బెల్‌ : వరుసగా ఐదోరోజూ రికార్డుల హోరూ

2020-12-18 21:30:30

img


దేశీయ మార్కెట్లో వరుసగా ఐదో రోజూ బుల్‌ పరుగు కొనసాగింది. నిన్న నెలకొల్పిన ఆల్‌టైమ్‌ రికార్డులను ఇవాళ దేశీయ సూచీలు తిరగరాశాయి. ఇవాళ ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైనప్పటికీ, మిడ్‌ సెషన్‌లో సూచీలకు ఒక్కసారిగా కొనుగోళ్ళ మద్దతు లభించింది. దీంతో సెన్సెక్స్‌ 47 వేల మార్కును క్రాస్‌ చేసేటట్లు కనిపించినప్పటికీ ఆ స్థాయిని అందుకోవడంతో విఫలమైంది. 

వీక్లీ ఆప్షన్స్‌ క్లోజింగ్‌ ఉండటంతో ఇవాళ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. హెల్త్‌కేర్‌, బ్యాంకింగ్‌, క్యాపిటల్‌ గూడ్స్‌, కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌ మినహా అన్ని కౌంటర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. దీంతో సెన్సెక్స్‌ 224 పాయింట్ల లాభంతో 46890 వద్ద, నిఫ్టీ 58 పాయింట్ల లాభంతో 13740 వద్ద ఇవాళ్టి ట్రేడింగ్‌ను ముగించాయి. బ్యాంక్‌ నిఫ్టీ 149 పాయింట్లు లాభపడి 30847కు చేరింది. ఇక ఇవాళ మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌కు చక్కని కొనుగోళ్ళ మద్దతు లభిస్తోంది. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్ సైకలాజికల్‌ ఫిగర్‌ 21వేల మార్కును క్రాస్‌ చేసింది. 2018 జనవరి తర్వాత మిడ్‌క్యాప్ ఇండెక్స్‌ 21వేల స్థాయిని అధిగమించడం ఇదే ప్రథమం.


Expert's View


ఇన్వెస్టర్లకు ఎనలిస్టుల "దసరా మాములు" స్టాక్ రెకమెండేషన్స్

Trending