ఇండియాలో ఇదే ఫస్ట్.. లైవ్ వెబినార్‌తో రికమెండేషన్స్ రివ్యూ... స్మాల్‌క్యాప్‌ సెలెక్ట్‌తో ఆరంభం!!

2021-06-04 09:10:27 By Krishnamohan Tangirala

img

ఇండియాలో ఇదే ఫస్ట్..

లైవ్ వెబినార్‌తో రికమెండేషన్స్ రివ్యూ...

స్మాల్‌క్యాప్‌ సెలెక్ట్‌తో ఆరంభం!!

 

తెలుగు ఇన్వెస్టింగ్ కమ్యూనిటీలో ఆరు నెలల క్రితం ఓ అద్భుతం ఆరంభమైందని చెప్పాలి. స్మాల్‌క్యాప్ సెలెక్ట్ అంటూ ప్రాఫిట్ యువర్ ట్రేడ్ ఆధ్వర్యంలో కొత్త సర్వీస్ ప్రారంభించాం. స్మాల్‌క్యాప్, మైక్రోక్యాప్ రంగాలలో ఉన్న రిస్క్‌పై హెచ్చరిస్తూనే... ఈ రంగాలలో ఉన్న అపారమైన అవకాశాలను ఇన్వెస్టర్లకు అందించాలనే సమున్నత లక్ష్యాన్ని ఆరంభించాం.

ఈ 6+ నెలల కాలంలో అనేక స్టాక్స్ ఇన్వెస్టర్లకు కాసుల పంట అందించాయి. కొద్ది రోజులు, కొద్ది వారాల్లోనే అనేక స్టాక్స్.. వాటికి ఇచ్చిన పూర్తి టార్గెట్‌ను కూడా అందుకుని మదుపర్లకు సంభ్రమాశ్చర్యాలతో పాటు ఆశించిన స్థాయికి లాభాలను పంచాయి.

ఇప్పటికి ఆరు నెలల కాలంలో అనేక రికమెండేషన్స్‌ను అందించడంతో.. ఇప్పుడు అనేక మందికి ఈ స్టాక్స్ నిర్వహణ కష్టతరం అయిపోయింది. అందుకే ఈ స్టాక్స్ పై భవిష్యత్తు కోసం నిర్ణయం తీసుకునేందుకు.. రివ్యూ చేయాలని నిర్ణయించాం.

అయితే... ఇప్పటివరకూ ఇండియాలో ఏ ఇతర అడ్వైజరీ సంస్థ చేయని విధంగా.. లైవ్ వెబినార్‌ ద్వారా సబ్‌స్క్రైబర్స్‌కు ఈ రివ్యూ అందించబోతున్నాం.

అయితే.. మాకు వెబినార్‌ ఇన్వైట్స్‌ను పంపేందుకు ఉన్న పరిమితుల కారణంగా.. ఈ వెబినార్‌కు సబ్‌స్క్రైబర్స్ అందిరినీ ఆహ్వానించలేము. FIRST COME FIRST SERVE బేసిస్‌లో మాత్రమే హాజరును అంగీకరించగలం.

కానీ.. మిగిలిన సబ్‌స్క్రైబర్స్ ఎవరూ ఈ విషయంలో నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఈ వెబినార్‌ను ఆమూలాగ్రం రికార్డ్ చేసి.. ఒక్క అక్షరం, ఒక్క సెకన్ కూడా ఎవరూ మిస్ కాకుండా.. మా స్మాల్‌క్యాప్ సెలెక్ట్ కస్టమర్స్ అందరికీ పంపిస్తాం.

ఈ వెబినార్‌లో Q&A సెషన్ నిర్వహించడం లేదు. దీనితో ఈ వెబినార్‌ లైవ్‌కు హాజరు కావడం, రికార్డింగ్‌ ద్వారా చూడడంలో అంతగా అంతరం ఉండదని అర్థం చేసుకోగలరు.
 


recommendations subscription review webinar

Expert's View


ఇన్వెస్టర్లకు ఎనలిస్టుల "దసరా మాములు" స్టాక్ రెకమెండేషన్స్

Trending