కరోనా తిరిగి విజృంభిస్తున్న సమయంలో గత ఏడాది ఎలాగైతే కొన్ని స్కీములు తెగ పాపులర్ అయ్యాయో అవే తిరిగి సర్క్యులేట్ అవుతున్నాయ్.జస్ట్ బయ్ నౌ..పే లేటర్( ఇప్పుడు కొనండి..తర్వాత చెల్లించండి) అంటూ లోన్లు ఇస్తామంటూ అట్రాక్టివ్ ఆఫర్లతో జనాలకు గాలం వేస్తున్నారు..చిక్కారో అంతే సంగతులు అని హెచ్చరిస్తున్నారు నిపుణులు.అసలు లాభం లేనిదే వ్యాపారి వరదన పడి పోడన్నట్లుగా మనకి అంత ఉదారంగా ఈ కంపెనీలు ఎందుకు ఇలాంటి ఆఫర్లు ఇస్తాయో కొంచెమైనా ఆలోచించండి
ఏదైనా సరే ఇప్పుడు కొనేసి, డబ్బులు తర్వాత చెల్లించడమంటే, వినడానికి చాలా సొంపుగా ఉంటుంది. కానీ ఆ తర్వాత జరిగేది మాత్రం చాలామందికి తెలీదు. ఎందుకంటే, ఎవరూ తమ కష్టాలను అవతలివారి ముందు ఓపెన్ చేయరు. నవ్వుతారని కావచ్చు. చులకన అవుతారని కావచ్చు. అసలు ఈ ప్లాన్లు ఎలా వర్కౌట్ చేస్తారంటే, గత రెండు మూడేళ్లుగా ఫిన్‌టెక్ కంపెనీలు ఈ BNPL బయ్ నౌ, పే లేటర్ తరహా పద్దతిని మనోళ్లకి బాగా అలవాటు చేశారు. కరోనా దెబ్బకి ఆర్థిక పరిస్థితులు తలకిందులు కావడంతో ఈ పద్దతిని ట్రై చేసినవాళ్లు ఎక్కువమందే ఉన్నారు. జెస్ట్‌మనీ రీసెర్చ్ ప్రకారం ఈఎంఐల ద్వారా కొనుగోళ్లు జరుగుతున్ననగరాలను పరిశీలిస్తే, ఎక్కువగా అంటే 68శాతంమంది 2 టైర్, 3 టైర్ సిటీవాసులే ఉన్నారు. మిగిలిన 32శాతం టైర్-1 సిటీవాసులు ఇలా ట్రాప్‌లో పడుతున్నవాళ్లుగా తేలింది
BNPL స్కీమ్ ఎలా పని చేస్తుందంటే
ఈ బిఎన్పిఎల్ స్కీమ్స్ ఎలా పని చేస్తాయంటే, ఒక్కసారి వాటిలో రిజిస్టర్ చేసుకున్నామంటే వాటి పార్ట్నర్ మర్చంట్స్ అన్నీ కలిపి ఓ 15 కంపెనీలు పూల్లా ఉంటాయి. వాటిలో ఏదైనా వస్తువు ముందు కొనుగోలు చేసుకుని తర్వాత పే చేయవచ్చు. ఐతే వాటికో టైమ్ లిమిట్ ఉంటుంది. అది 15-30రోజుల వరకూ ఉంటుంది. ఈ గడువు దాటిందా, ఇక బాదుడే బాదుడు మొదలవుతుంది.
అసలుపై వడ్డీ రేటు మీరు ఎంచుకున్న సంస్థ ముందుగా ఎంత ఫిక్స్ చేస్తుందో వాటికి అనుగుణంగా బాదేయడం ప్రారంభమవుతుంది. అలానే ముందుగా భారీగా ఖరీదైన వస్తువులను కూడా నో కాస్ట్ క్రెడిట్ అంటూ మూడు ఆరు నెలల వాయిదాలుగా మార్చుకునే ఛాన్స్ ఇస్తూ...తెలివిగా మనకి తెలీకుండానే వడ్డీ వేస్తారు. గడువు లోపల కట్టలేదంటూ బోలెడంత వడ్డీ కట్టాల్సి వస్తుంది. అంటే ఓ వంద కట్టాల్సిన చోట 150 కట్టాల్సి రావచ్చు. నెలలో 100మంది కస్టమర్లు దొరికితే వాళ్లలో
ముగ్గురు ఇలా కట్టకపోతే చాలు వాళ్ల వ్యాపారం భేషుగ్గా సాగిపోతుంది. ఎందుకంటే ఓ వైపు సరుకుకు సరుకు అమ్ముడవుతుంది. మరోవైపు ఇలా వడ్డీ రూపంలో బోలెడంత ఆదాయం.పైగా బిల్లింగ్ కూడా నెలకి కాకుండా 15 రోజులకు ఒకసారి చేయడమే ఈ యాప్ కాలాంతకుల అసలు కిటుకు
కొన్ని BNPL యాప్స్
అమెజాన్ పే, ఈపేలేటర్(ePayLater),కిషిట్(Kissht),లేజీ పే,సింపుల్(Simpl)స్లైస్(Slice),జెస్ట్‌మనీ కొన్ని
క్రెడిట్ కార్టు లేకపోయినా, ఇలా చెల్లింపులకు వీలు ఉండటంతో చాలామంది ఇలా డెట్ ట్రాప్‌లో పడుతున్నారు. ఎందుకంటే ఇవి వడ్డించే ఛార్జీలు చూడండి మరి ! Simpl అనే యాప్‌లో కనుక ఏవైనా కొనుగోలు చేసారనుకోండి. ప్రతి 15 రోజులకు బిల్లింగ్ సైకిల్ వేస్తుంది. అంటే ప్రతి పదిహేను రోజుల గడువు తర్వాత మీరు పే చేయకపోతే వడ్డీ అదనం, లేట్ పెనాల్టీ ప్లస్ రూ.250 జిఎస్టీ అదనం
అదే కిష్ట్(kissht) యాప్ ద్వారా అనుకోండి, యాన్యువల్ ఇంట్రెస్ట్ 21శాతం వడ్డిస్తుంది. లేజీ పే పరిస్థితి కూడా ఇంతే, ఈఎంఐలుగా కన్వర్ట్ చేసిన మొత్తాలపై 15-32శాతం వడ్డీని వసూలు చేస్తుంది. పైగా రోజువారీ పద్దతిపై ఈ అదనపు బాదుడును మొబైల్ పిండి మరీ వసూలు చేస్తుంది
ePayLater అయితే డిఫాల్ట్ ఇంట్రెస్ట్‌గా 36శాతం యూజర్లపై అదనంగా బాదుతుంది. అంటే పొరబాటున ఒక్క రోజు చెల్లింపు ఆలస్యమైతే ఇంత భారీగా జరిమానా తప్పదన్నమాట. ఆ..మేం చాలా ఖచ్చితంగా చెల్లించేస్తాం అంటారా..అంత సామర్ధ్యం ఉన్నప్పుడు అనవసరంగా ఇలాంటి యాప్‌లో జోలికి పోవడం ఎందుకు? అదేదో ముందే చెల్లిస్తే పోలా అనేది అనుభవజ్ఞుల సూచన. లేదంటే మాత్రం కష్టార్జితాన్ని చేజేతులారా ఇలా యాప్కింకరుల చేతిలో పోసినట్లే ఎందుకంటే అసలు నెలరోజుల బిల్లింగ్ సైకిలే చాలామందికి అర్ధం కాక క్రెడిట్ కార్డులు వాడటం మానేసిన రోజుల్లో..ఇలా 15రోజుల బిల్లింగ్ చేసే బయ్ టుడే పే లేటర్ ట్రాప్‌లో పీకల్లోతు ఇరుక్కుపోవడం ఖాయం..కాబట్టి తస్మాత్ జాగ్రత్త..!