రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా ఎఫెక్ట్.. రెండు రోజుల్లో 54% జూమ్ చేసిన జీ ఎంటర్‌టైన్‌మెంట్ 

2021-09-15 11:14:38 By VANI

img

ఏస్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝన్‌ఝన్‌వాలాకు చెందిన స్టాక్ ట్రేడింగ్ సంస్థ రేర్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, బోఫా సెక్యూరిటీస్ యూరోప్ ఎస్‌ఏ మంగళవారం రూ.225 కోట్ల విలువైన కంపెనీ షేర్లను ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా కొనుగోలు చేసిన తర్వాత జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ (ZEE) షేర్లు పరుగు ప్రారంభించాయి. బుధవారం నాటి ఇంట్రాడే ట్రేడ్‌లలో ఎన్‌ఎస్‌ఈలో జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్లు 10 శాతం పెరిగి 52 వారాల గరిష్ట స్థాయి రూ.277.70ని తాకింది. 

 

బ్రాడ్‌కాస్టింగ్ అండ్ కేబుల్ టీవీ ఆపరేటర్ స్టాక్ జనవరి 2020 నుంచి అత్యధిక స్థాయిలో ట్రేడవుతోంది. ఇది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ (F&O) విభాగంలో ట్రేడ్ చేస్తుంది. దీనికి సర్క్యూట్ పరిమితులైతే లేవు. మంగళవారం, సెప్టెంబర్ 14, 2021 న ఎన్‌ఎస్‌ఈలో బల్క్ డీల్ లావాదేవీల ద్వారా రేర్ ఎంటర్‌ప్రైజెస్ 5 మిలియన్ ఈక్విటీ షేర్లను షేర్‌కు రూ. 220.44 చొప్పున కొనుగోలు చేసింది. 

 

BofA సెక్యూరిటీస్ యూరోప్ SA, అదే సమయంలో సగటున రూ.236.2 ధరతో 4.86 మిలియన్ షేర్లను కొనుగోలు చేసింది. గత రెండు ట్రేడింగ్ రోజుల్లో జీ ఎంటర్‌టైన్‌మెంట్ మార్కెట్ ప్రైస్ 54 శాతం పెరిగింది. దాని అగ్రశ్రేణి వాటాదారులు ఇద్దరు ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ మరియు CEO పునిత్ గోయెంకా మరియు ఇద్దరు స్వతంత్ర డైరెక్టర్లను బోర్డు నుండి తొలగించాలని కోరిన విషయాన్ని రెగ్యులేటరీ దాఖలు చేయడంతో ఇది భారీగా పెరిగింది. ఇక మంగళవారం జరిగిన డీల్‌తో కంపెనీ షేర్లకు రెక్కలొచ్చాయి. 


Zee Entertainment LImited  Rakesh Jhunjhunwala  Bofa Securities  Bofa Securities  Rare Enterprises Limited

Expert's View


అవకాశం ఇచ్చిన tv5 నాయుడు గారికి | ఆదరిస్తున్న మీకు నా ధన్యవాదాలు

Trending