ట్రేడింగ్ సమయంలో మీ ఎమోషన్స్ గమనిస్తున్నారా

2021-10-23 09:46:03 By Y Kalyani

img

ట్రేడింగ్ సమయంలో మీ ఎమోషన్స్ గమనిస్తున్నారా
గతి తప్పితే ప్రమాదకరమే
ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ పై నిర్ణయముండాలి

రివేంజ్ ట్రేడింగ్ చేస్తే అసెట్ ఖల్లాస్

ప్రాఫిట్ యువర్ ట్రేడ్ స్పెషల్ స్టోరీ

మనకుండే శక్తి కన్నా కూడా సహనం చాలాసార్లు మంచి ఫలితాలు ఇస్తుంది. అవును భావోద్వేగాలు అదుపులో పెట్టుకోలేని వారు ఎప్పటికీ గెలవలేదు. భారతలో పాండవులు అజ్ఞాత‌వాసం చేసిన తర్వాతే యుద్ధం చేసి రాజ్యం సాధించారు. రాముడు కూడా వనవాసం తర్వాతే రాజ్యాధికారం చేపట్టారు. ఎక్కడైనా సహనం, ఎమోషన్స్ విజయాన్ని అందిస్తాయని పురాణాలు కూడా చెబుతున్నాయి. ఇందుకు స్టాక్ మార్కెట్ కూడా అతీతం కాదు. మంచి లాభాలు దక్కాలంటే సహనంతో వేచిఉండాలి. ట్రేడింగ్ పలితాలు సానుకూలంగా ఉండాలంటే ఎమోషన్స్ అదుపులో ఉండాలి.
దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్టస్థాయిని తాకుతున్నాయి. BSE సెన్సెక్స్ మరియు నిఫ్టీలు రికార్డు హై టచ్ చేశాయి. ఇన్వెస్టర్ల వెల్త్ పెరుగుతుంది. కంపెనీల నెట్ వర్త్ పతాకస్థాయికి చేరుతోంది. మార్కెట్ లో ఉన్న ట్రేడర్స్ కు ఇది బెస్ట్ టైమ్ అంటున్నారు నిపుణులు. గడిచిన ఏడాదిన్నరగా మార్కెట్లో సహనంతో వేచిచూసినవాళ్లకు మంచి స్టాక్స్ మంచి రిటర్న్స్ ఇచ్చాయి. భావోద్వేగాలకులోనుకాకుండా ట్రేడ్ చేసినవాళ్లకు మంచి లాభాలు సొంతం చేసుకున్నారు. 

మీరు ట్రేడింగ్ చేసినా.. ఇన్వెస్ట్ చేసినా కూడా మీకంటూ లక్ష్యం ఉండాలి. మీరు భావోద్వేగాలతో వ్యాపారం చేయవద్దు. అదుపులో లేకపోతే మీరు భయం లేదా అత్యాశతో ఉన్నట్టే. ఎమోషన్ ట్రేడిండ్ లేదా ఇన్వెస్టిమెంట్ దీర్ఘకాలంలో మీ లక్ష్యాలను చేరుకోలేదు. అందుకే అందువల్ల, భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.

రిస్క్ వైపు నడిపిస్తుంది...
భావోద్వేగాల మధ్య చేసే ట్రేడింగ్ మిమ్మల్ని రిస్క్ వైపు తీసుకెళుతుంది. పెద్ద మొత్తంలో డబ్బును కోల్పోయే ప్రమాదం ఉంది. కొత్తగా మార్కెట్లోకి వచ్చి ఉంటే.. అనుభవం లేకపోతే ఆర్ధికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మార్కెట్ నుంచి నష్టాలతో బయటకు రావాల్సి వస్తుంది. దీర్ఘకాలిక సంపద సృష్టికి మరియు ద్రవ్యోల్బణాన్ని అధిగమించే రాబడిని పొందేందుకు ఈక్విటీల సామర్థ్యాన్ని కోల్పోతారు. మీకంటూ లక్ష్యాలు ఉండాలి. 

ఓవర్‌ట్రేడింగ్‌లో ఫలితాలు
ఫియర్ ఆఫ్ మిసింగ్ అవుట్ FOMO ఉంటుంది. ఇది అత్యంత ప్రమాదకరం. మార్కెట్లో బుల్ పరుగు ఉన్నప్పుడు మిస్ అవుతున్నామన్న కంగారులో ఓవర్ ట్రేడిండ్ చేస్తారు. ఈ సమయంలో మీరు జాగ్రత్తగాఅడుగులు వేయాలి. ఎమోషన్ అదుపులో పెట్టుకుని కేపిటల్ కాపాడుకుంటూ ట్రేడ్ చేస్తే మంచిది. తొందరలో బ్యాడ్ కాల్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఎమోషన్స్ లేకుండా సహనం, ఓర్పుతో ట్రేడింగ్ చేస్తే ఎప్పుడు స్టాప్ చేయాలో తెలుస్తుంది. మీ డబ్బు కరిగిపోకుండా చేస్తుంది. రీసెంట్ గా IRCTCషేరు విషయంలో ట్రేడింగ్ చూశాం.. ఒక్కరోజే 30శాతం వరకు నష్టపోయింది. భారీగా పెరుగుతుంది... ర్యాలీ కంటిన్యూ అవుతుందని అంచనాలు పెంచుకుంటూ ఓవర్ ట్రేడ్ చేసినవాళ్లు నష్టపోయారు. మీరు ఎక్కువ కాలం ట్రేడిండ్ చేయడం వలన మార్కెట్‌లో ఎక్కువ సమయం గడపడానికి సహాయపడుతుంది. అనుభవం వస్తుంది.

రివెంజ్ ట్రేడింగ్ ప్రమాదం...
భావోద్వేగాలకు లోబడి మీరు ట్రేడింగ్ చేసి నష్టపోతే అనుభవంగా మలుచుకోవాలి తప్ప.. రివేంజ్ ట్రేడిండ్ చేయవద్దు. మరింత మునిగిపోయే ప్రమాదం ఉంది. వచ్చిన నష్టాన్ని పూడ్చుకోవాలన్న ఆవేశంలో మీరు చేసే తప్పులు ఇంకా నష్టాలను పెంచుతాయి. నష్టాలను పూడ్చుకోవడానికి సహనంలో వేచి ఉండండి. 

భావోద్వేగాలతో చేసే ట్రేడిండ్ స్వయ తప్పిదమే అవుతుంది. దీనికి మార్కెట్ బాధ్యత కాదు. మీ వెల్త్ కరిగిపోవడానికి ఓ గేట్ వే అవుతుంది. వాస్తవాలు మరియు లెక్కలు వేసుకుని టార్గెట్ పెట్టుకుని ఎమోషన్స్, ఓర్పు తెచ్చుకుని ట్రేడింగ్ చేసినా.. ఇన్వెస్ట్ చేసినా మీకు అంతిమంగా లాభాలు పంచుతుంది. సంపద పెంచుతుంది.


trading bse nifty investors

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending