ఇన్ని కలిస్తేనే కానీ మార్కెట్లు లాభపడలేదు..! మరి గురువారం ఏం చేయాలి?

2021-04-13 17:47:31 By Anveshi

img

స్టాక్ మార్కెట్లు ఇవాళ 14500 పాయింట్ల పైన క్జోజవడానికి నానా ఆపసోపాలు పడింది. అప్పటికి మధ్యాహ్నం 12 గంటల సమయంలో ప్రదాన ఇండెక్స్‌లు రెండూ నష్టాల్లోకి జారుకున్నాయ్ కూడా..! ఐతే, నిఫ్టీ బ్యాంక్, ప్రవేట్ బ్యాంక్స్, ఫైనాన్స్ స్టాక్స్, మెటల్, రియాల్టీ, స్టాక్స్ పెరగడంతోనే ఇండెక్స్‌లు లాభంతో ముగిశాయ్.అలానే హెవీ వెయిట్ స్టాక్ రిలయన్స్ కూడా నిఫ్టీని బాగా పుష్ చేసింది. దీంతో నిఫ్టీ 194 పాయింట్లలాభంతో 14504 పాయింట్ల దగ్గర,సెన్సెక్స్ 661 పాయింట్లు లాభపడటం సాధ్యపడింది. సెన్సెక్స్ 48554 పాయింట్ల దగ్గర ముగిసింది. 

ఆశ్చర్యకరంగా ఫార్మా ఇండెక్స్ 1 శాతం నష్టపోగా, దానికి ప్రాఫిట్ బుకింగ్ కారణంగా తెలుస్తోంది. మిడి క్యాప్ ఇండెక్స్ దాదాపు ఒకటిన్నరశాతం లాభపడగా,  ఓవరాల్‌గా, అక్రాస్‌ ది బోర్డ్ అప్‌బీట్ అని అనలిస్టులు చెప్తున్నారు.ఇప్పుడిలానే అంటారు కానీ, మళ్లీ మార్కెట్లు పడ్డాయా, వెంటనే దానికి కరోనా కేసులను కారణంగా చూపడం అలవాటైపోయింది. ఎందుకంటే నిన్న ఒక్క రోజే నిఫ్టీ 524 పాయింట్లు నష్టపోయిన తర్వాత ఈ మాత్రం షార్ట్ కవరింగ్ కానీ, లోయర్ లెవల్ దగ్గర బయింగ్ కానీ కన్పించడం గొప్ప విషయమేం కాదు. ఐతే ఈ 14500 పాయింట్ల మార్క్ అనేది గురువారం ట్రేడింగ్‌లో నిలబడుతుందా లేదా చూడాలి. 

ఇక రిజల్ట్స్ బానే ఉన్నా, ప్రాఫిట్ బుకింగ్, అనలిస్టుల డౌన్‌గ్రేడ్‌తో టిసిఎస్ 4శాతం నష్టపోవడం హైలైట్. గెయినర్లలో మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్ సర్వ్, టాటామోటర్స్,బజాజ్ ఫైనాన్స్, మారుతి సుజికి 8 నుంచి 4.50శాతం వరకూ లాభపడ్డాయ్. లూజర్లలో డాక్టర్ రెడ్డీస్ 4.40శాతం, టెక్ మహీంద్రా,3.65శాతం విప్రో 3.16శాతం, హెచ్‌సిఎల్ టెక్ 2.58శాతం నష్టపోయాయ్

మరి గురువారం ఏం చేయాలి?
ఏప్రిల్ 14, తమిళ కొత్త సంవత్సరం, ఓనం, అంబేద్కర్ జయంతి సందర్భంగా బుధవారం సెలవు కావడంతో ఇక మార్కెట్లు గురువారమే తెరుచుకుంటాయ్. ట్రేడర్లు ఇన్వెస్టర్లుగా ఇండెక్స్ పరంగా బయ్ ఆన్ డిప్స్ స్ట్రాటజీ అవలంబిస్తూనే 14000 పాయింట్ల మార్క్‌ని దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు. ఎందుకంటే అమ్మకాల ఒత్తిడి కొనసాగితే, ఆ లెవల్ కూడా బ్రీచ్  అవ్వొచ్చు. మిగిలిన రెండు రోజుల ట్రేడింగ్ ఒడిదుడుకుల మధ్యే కొనసాగవచ్చనేది ఎక్కువమంది అనలిస్టుల అభిప్రాయం. అప్‌సైడ్ కొనసాగితే 14650-14800 వరకూ, డౌన్‌సైడ్ అయితే 14100 నుంచి 14250 వరకూ పతనం కావచ్చనేది వారి సూచన. 


nifty thursday trading 14500 mark level reclaims investors telugu profit trade

Expert's View


ఒక స్టాక్ మల్టీ బ్యాగర్ అవ్వటానికి 20 సంవత్సరాలు పడుతుందా ?

Trending