ఈ సమ్మర్ ఎండలను బీట్ చేసేందుకు ఏసీలు,కూలర్లు రెడీ అవగా, స్టాక్ మార్కెట్లలోనూ ఆ కంపెనీల స్టాక్స్ ర్యాలీకి రెడీ అయ్యాయ్.ముందుగా వోల్టాస్ కంపెనీ షేర్లు ఇవాళ ఇంట్రాడేలో దాదాపు 4 శాతానికి పైగా పెరిగాయి. దీంతో వోల్టాస్ స్టాక్ ధర రూ.1009.70 వరకూపెరిగింది. ఆ తర్వాత కూడా ఈ ధరని సవరించేందుకు స్టాక్‌లో ట్రేడింగ్ జోరుగా సాగుతోంది
వోల్టాస్ షేరు 52 వీక్స్ హై ప్రైస్ రూ.1131.20 కాగా, 52వీక్స్ లోయర్ సైడ్ రూ.428. స్టాక్ హయ్యర్ పిఈ రేషియో ఉన్నా కూడా ఇన్వెస్టర్లు ఫ్యూచర్ గ్రోత్‌ని, సేల్స్‌ని దృష్టిలో పెట్టుకుని వోల్టాస్ షేరును కొనుగోలు చేసేందుకు సిద్ధపడుతున్నట్లు అంచనా.
ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ : గత 16ఏళ్ల ట్రేడింగ్‌లో ఇంట్రాడేలో వోల్టాస్ షేరు కేవలం 3.48శాతం సెషన్లు మాత్రమే 5శాతం డౌన్ అయ్యాయ్.