మరో వివాదంలో వొడాఫోన్ ఐడియా.. మళ్లీ తెరమీదకు పాత ఫిర్యాదు

2021-09-15 08:33:51 By Y Kalyani

img

మరో వివాదంలో వొడాఫోన్ ఐడియా.. మళ్లీ తెరమీదకు పాత ఫిర్యాదు

వొడాఫోన్ ఐడియా షేర్ హోల్డర్ సత్య ప్రకాష్ సిన్హా అనే వ్యక్తి  సంస్థ మాజీ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లాపై ఫిర్యాదు చేశారు.  జూన్ 7 న వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ ఛైర్మన్ గా కుమార్ మంగళం బిర్లా తన వాటాను భారత ప్రభుత్వానికి లేదా ప్రభుత్వం ఆమోదించిన ఏదైనా కంపెనీకి ఉచితంగా ఇస్తానని ఆఫర్ చేశారట. అయితే ఈ విషయంలో షేర్ హోల్డర్స్ కు చెప్పకపోవడం లిస్టెడ్ కంపెనీ నియమాలకు విరుద్దమని ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. దీని వల్ల షేరు 40శాతం వరకూ పడిపోయిందని.. షేర్ హోల్డర్స్ గా తీవ్రంగా నష్టపోయామని అందులో పేర్కొన్నారు.  వాస్తవానికి ఈ విషయం ఆగస్టు 2 న మీడియా ద్వారా బయటకు వచ్చింది. స్టాక్ ఎక్స్ఛేంజీలు ఆగస్టు 4 న వోడాఫోన్ ఐడియా నుండి వివరణ కోరింది. KM బిర్లా ఆగస్టు 4 న వోడాఫోన్ ఐడియా ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు.  జూన్ 7 న రూ. 10.10 గా ఉన్న కంపెనీ షేర్ ధర ఆగస్టు 4 న రూ .6 కి పడిపోయిందని - కేవలం రెండు నెలల్లోనే 40 శాతానికి పైగా పడిపోయిందని ఫిర్యాదుచేసిన  సిన్హా చెప్పారు. మరోసారి కంపెనీ ఛైర్మన్ గా వ్యవహరించిన బిర్లా, ప్రమోటర్లపై చర్యలు తీసుకోవాలని కంప్లయింట్ చేశారు.
 


birla vodafone idea telco

Expert's View


అవకాశం ఇచ్చిన tv5 నాయుడు గారికి | ఆదరిస్తున్న మీకు నా ధన్యవాదాలు

Trending