నాలుగు రెట్లు లాభం పెరిగిన వేదాంతా

2021-07-27 09:12:32 By Y Kalyani

img

నాలుగు రెట్లు లాభం పెరిగిన వేదాంతా

FY22 ఆర్ధిక సంవత్సరం జూన్‌ తొలి త్రైమాసికంలో మైనింగ్ కంపెనీ వేదాంతా రూ.4,280 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్ధిక సంవత్సరం ఇదే కాలానికి కంపెనీ నికర లాభం రూ.1,033 కోట్లు మాత్రమే. అంటే నాలుగు రెట్లు పెరిగింది. కంపెనీ ఆదాయం రూ.16,998 కోట్ల నుంచి రూ.29,151 కోట్లకు ఎగబాకింది. వ్యయం రూ.14,965 కోట్ల నుంచి రూ.21,847 కోట్లకు చేరాయి. కంపెనీ అప్పులు కూడా త్రైమాసికం చివరి నాటికి రూ.20,261 కోట్లు. 549 కిలో టన్నుల అల్యూమినియం, 236 కేటీ జింక్‌, వెండి ఉత్పత్తి కూడా 37 శాతం పెరిగి 161 టన్నులకు ఉత్పత్తి చేసింది. ముడి ఇనుప ఖనిజం 1.4 మిలియన్‌ టన్నులు, ఉక్కు 289 కిలో టన్నుల మేర ఉత్పత్తి చేసినట్లు తెలిపింది. 


vedanta profits q1

Expert's View


అవకాశం ఇచ్చిన tv5 నాయుడు గారికి | ఆదరిస్తున్న మీకు నా ధన్యవాదాలు

Trending