రెండు రెట్లు పెరిగిన UltraTech లాభం

2021-01-24 09:07:41 By Y Kalyani

img

రెండు రెట్లు పెరిగిన UltraTech లాభం
రెవిన్యూ 17శాతం.. నెట్ ప్రాఫిట్ వందశాతం

నిర్మాణం రంగ ఊపందుకోవడంతో కంపెనీల లాభాలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. తాజాగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్, డిసెంబర్ మధ్య త్రైమాసికానికి ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన ఆల్ట్రా టెక్ సిమెంట్ నెట్ ప్రాఫిట్ రూ.1584.58 కోట్లు ప్రకటించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి కంపెనీ నికరలాభం కేవలం రూ. 711.17 కోట్లు మాత్రమే. అంటే దాదాపు రెండు రెట్లు పెరిగింది. రూరల్, సెమీ అర్బన్ హౌసింగ్ మెరుగ్గా ఉంది. అటు ప్రభుత్వం తీసుకున్న చర్యలతో నిర్మాణం రంగం జోరుగా ఉంది. కోవిడ్ కారణంగా వెనక్కు వెళ్లినకార్మికులు మళ్లీ తిరిగ రావడంతో నగరాల్లో కూడా నిర్మాణాలు పెరిగాయి. దీంతో సిమెంట్ కంపెనీల అమ్మకాలు పెరిగాయి. దీనికి తోడు పెరిగిన డిమాండ్, ధర కారణంగా లాభాలు కూడా అంతేస్థాయిలో ఉన్నాయి. 

నెంబర్స్..
ఆల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ నిర్వహణ ఆదాయం రూ.12254 కోట్లు వచ్చింది. గత ఏడాది త్రైమాసికంతో పోల్చితే ఇది 17.38శాతం పెరిగింది. గత ఏడాది ఇది రూ.10,439 కోట్లుగా ఉంది. మొత్తం వ్యయం రూ.10,190 కోట్లుగా ఉంది. గత ఏడాది కంటే 6.29శాతం తగ్గింది. కంపెనీ ఉత్పత్తి కూడా 14శాతం పెరిగి 22.82 మిలియన్ టన్నులకు పెరిగింది. 
తగ్గిన అప్పులు...
కంపెనీ నిర్వహణ వ్యయం తగ్గించుకుంటూ అప్పులు కూడా గణనీయంగా తగ్గించింది. గత ఏడాది ఇదే కాలానికి కంపెనీ అప్పులు రూ.7424 కోట్లు ఉండగా.. ప్రస్తుతం ఇది రూ.2696 కోట్లకు పరిమితం అయింది. 

Expert's View


MTAR Technologies కాసుల వర్షం కురిపిస్తుందా?

Trending