Trend Today - May 13

2022-05-13 08:25:18 By Marepally Krishna

img

ఇవాళ దేశీయ మార్కెట్లు గ్యాప్‌ అప్‌తో ప్రారంభమయ్యే ఛాన్స్‌

175 పాయింట్లకు పైగా లాభంతో 16వేలకు సమీపంలో ట్రేడవుతోన్న ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

జకార్తా మినహా జోరుమీదున్న ఆసియా మార్కెట్లు

రెండున్నర శాతం లాభంతో నిక్కాయ్‌, రెండుశాతం పెరిగిన హాంగ్‌సెంగ్‌ ఇండెక్స్‌

ఒకటిన్నర శాతం పైగా లాభంతో కోస్పి, తైవాన్‌, స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ సూచీలు

మిశ్రమంగా ముగిసిన అమెరికా మార్కెట్లు

ద్రవ్యోల్బణ నియంత్రణపై దృష్టిపెట్టినందున సాఫ్ట్‌ ల్యాండింగ్‌కు ఎలాంటి హామీ ఇవ్వలేమని స్పష్టం చేసిన యూఎస్‌ ఫెడ్‌ చీఫ్‌ పావెల్‌

8 సంవత్సరాల గరిష్ట స్థాయిని నమోదు చేసిన సీపీఐ ద్రవ్యోల్బణం

ఏప్రిల్‌లో 7.79శాతంగా నమోదైన సీపీఐ ద్రవ్యోల్బణం 

2014 మే తర్వాత ఆ స్థాయిలో సీపీఐ ద్రవ్యోల్బణం అత్యధికంగా నమోదు కావడం ఇదే తొలిసారి

మార్చిలో 1.5శాతం నుంచి 1.9శాతానికి పెరిగిన ఐఐపీ వృద్ధిరేటు

గత ఆర్థిక సంవత్సరంలో 4.3శాతం పెరిగిన 8 ప్రధాన రంగాల ఉత్పత్తి రేటు

ఏప్రిల్‌లో 6శాతం తగ్గిన 8 ప్రధాన రంగాల ఉత్పత్తి రేటు

జూన్‌ 6-8 వరకు ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశం, వడ్డీరేట్లు పెరగవచ్చని ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్‌ అంచనాలు

డాలర్‌ స్ట్రాంగ్‌తో వరుసగా నాల్గో వారం తగ్గిన బంగారం ధర

3 నెలల కనిష్టానికి బంగారం, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ గోల్డ్‌ 1820 డాలర్లు

క్రితం ట్రేడింగ్‌ సెషన్‌లో రూ.5255.75 కోట్ల షేర్లను విక్రయించిన ఎఫ్‌ఐఐలు

గురువారం ట్రేడింగ్‌లో రూ.4815.64 కోట్ల షేర్లను కొనుగోలు చేసిన డీఐఐలు


bse nse stock market bull bear loss profit trading Telugu News

Expert's View


ఏ దేశ ద్రవ్యోల్బణం చూసినా ఏముంది గర్వకారణం ?

Trending